ఢిల్లీ : ఆధిపత్య ధోరణి వల్లనే యుద్దాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్. భారత దేశంలో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్బంగా ప్రత్యేకంగా సమవేశం అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీతో. కీలకమైన చర్చలు జరిపారు. అనంతరం రాష్ట్రపతి భవన్ లో దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన గౌరవార్థం ఏర్పాటు చేసిన విందుకు హాజరయ్యారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాట్లాడారు విందులో పాల్గొన్న ప్రతినిధులను ఉద్దేశించి. ప్రపంచంలో రష్యా దేశంతో అత్యంత సన్నిహిత సంబంధం కలిగిన ఏకైక దేశం ఒక్కటే ఉందని, అది భారత దేశం అని స్పష్టం చేశారు. తనకు నమ్మకమైన స్నేహితుడిగా మోదీని పేర్కొన్నారు.
మా ఇద్దరి మధ్య స్నేహ పూర్వకమైన అనుబంధం ఉందని చెప్పారు వ్లాదిమిర్ పుతిన్. రష్యా , భారతదేశం కలిసి ముందుకు సాగుతాయని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్పా తాము దాడులకు దిగడం లేదని చెప్పారు. న్యాయమైన ప్రపంచ క్రమాన్ని స్థాపించడానికి కలిసి పని చేస్తున్నామని తెలిపారు. ఐక్యరాజ్యసమితి కేంద్ర పాత్ర, అంతర్జాతీయ సమాజంలోని అన్ని సభ్యుల మధ్య ప్రయోజనాల సమతుల్యతపై ఆధారపడి ఉండాలని తామిద్దరం నమ్ముతున్నామని స్పష్టం చేశారు వ్లాదిమిర్ పుతిన్. 2026లో బ్రిక్స్ అధ్యక్షుడిగా ప్రపంచంలోని అన్ని దేశాలకు భద్రత, నమ్మకం, శాంతియుత వాతావరణాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
