IND vs WI Test Match Interesting Update : అడ్డు గోడ‌లా నిల‌బ‌డిన కాంప్ బెల్, షాయ్

3 వికెట్లు కోల్పోయి 252 ర‌న్స్ చేసిన విండీస్

Hello Telugu - IND vs WI Test Match Interesting Update

Hello Telugu - IND vs WI Test Match Interesting Update

IND vs WI : న్యూఢిల్లీ : న్యూఢిల్లీ లోని అరుణ్ జైట్లీ మైదానంలో జ‌రుగుతున్న 2వ టెస్టు మ్యాచ్ ఆస‌క్తిక‌రంగా మారింది. తొలి ఇన్నింగ్స్ లో భార‌త (India) జ‌ట్టు 5 వికెట్లు కోల్పోయి 518 ప‌రుగుల వ‌ద్ద ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. య‌శ‌స్వి జైస్వాల్ 175 ర‌న్స్ చేస్తే కెప్టెన్ గిల్ 129 ర‌న్స్ తో నాటౌట్ గా నిలిచాడు. అనంత‌రం బ‌రిలోకి దిగిన వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 248 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. దీంతో రెండో ఇన్నింగ్స్ ఆడ‌కుండానే ముందు ప్లాన్ తో కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేశాడు. దీంతో వెస్టిండీస్ ఫాలో ఆన్ ఆడ‌క త‌ప్ప‌లేదు. తొలి ఇన్నింగ్స్ లో త‌మ బౌలింగ్ తో క‌ట్ట‌డి చేశారు భార‌త బౌల‌ర్లు. కుల్దీప్ యాద‌వ్ 82 ర‌న్స్ ఇచ్చి 5 వికెట్లు తీశాడు.

IND vs WI Test Match Updates

ఇక ర‌వీంద్ర జ‌డేజా 3 వికెట్లు తీస్తే జ‌స్ ప్రీత్ బుమ్రా, సిరాజ్ చెరో వికెట్ తీశారు. అయితే తొలి ఇన్నింగ్స్ లో స‌త్తా చాటిన బౌల‌ర్లు రెండో ఇన్నింగ్స్ లో విండీస్ బ్యాట‌ర్ల‌పై ప్ర‌భావం చూపించ‌లేక పోయారు. దీంతో రెండో ఇన్నింగ్స్ లో కీల‌కంగా ఆడారు జాన్ కాంప్ బెల్ , షాయ్. నాల్గ‌వ రోజు లంచ్ స‌మ‌యానికి విండీస్ కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 252 ర‌న్స్ చేసింది. ఆట ప్రారంభమైన మొదటి గంటలో కాంప్‌బెల్ 199 బంతులు ఎదుర్కొని 115 ర‌న్స్ చేశాడు. హోప్ 92 ర‌న్స్ చేసి ఇంకా మైదానంలో ఉన్నాడు. ఎంత‌గా బౌల‌ర్లు ప్ర‌య‌త్నం చేసినా వ‌ర్క‌వుట్ కాలేదు. ర‌వీంద్ర జ‌డేజా 25 ఓవ‌ర్లు వేసి 75 ర‌న్స్ ఇచ్చి ఒక వికెట్ తీశాడు. కాంప్‌బెల్-హోప్ జంట మూడో వికెట్‌కు 177 పరుగులు జోడించారు.

Also Read : Deepshikha: The Elegant Beauty Who Captures Hearts with Her Grace and Charm

Exit mobile version