Sunil Gavaskar Shocking Comments on Jaiswal : జైస్వాల్ ట‌న్నుల కొద్దీ ప‌రుగులు చేయాలి

యంగ్ క్రికెట‌ర్ పై సునీల్ గ‌వాస్క‌ర్ ప్ర‌శంస‌లు

Hello Telugu - Sunil Gavaskar Shocking Comments on Jaiswal

Hello Telugu - Sunil Gavaskar Shocking Comments on Jaiswal

Sunil Gavaskar : న్యూఢిల్లీ : భార‌త మాజీ క్రికెట‌ర్, ప్ర‌ముఖ యాంక‌ర్ సునీల్ మ‌నోహ‌ర్ గవాస్కర్ (Sunil Gavaskar) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. యంగ్ క్రికెట‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు. స్వ‌దేశంలో వెస్టిండీస్ తో జ‌రుగుతున్న టెస్టు సీరీస్ లో భాగంగా న్యూఢిల్లీలో జ‌రిగిన మ్యాచ్ లో దుమ్ము రేపాడు. భారీ ఎత్తున ప‌రుగులు చేశాడు. 23 ఏళ్ల వ‌య‌సు క‌లిగిన జైశ్వాల్ సూప‌ర్ షో చేశాడు. సెంచ‌రీతో క‌దం తొక్కాడు. క‌ళ్లు చెదిరే షాట్స్ తో అల‌రించాడు న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ మైదానంలో. రెండ‌వ టెస్టులో బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు జైస్వాల్. త‌ను 258 బంతులు ఎదుర్కొని 175 ర‌న్స్ చేశాడు. ఈ సంద‌ర్భంగా గ‌వాస్క‌ర్ స్పందించాడు. రాబోయే రోజుల్లో త‌న కెరీర్ ప‌రంగా ప‌రుగుల వ‌ర‌ద పారించాల‌ని కోరాడు.

Sunil Gavaskar Key Comments

ఆ ఆడే స‌త్తా, ద‌మ్ము ఈ యంగ్ క్రికెట‌ర్ కు ఉంద‌న్నాడు గ‌వాస్క‌ర్. ఓ వైపు తొలి కొత్త బంతిని ఆడ‌డంలో త‌ను ప్ర‌ద‌ర్శించిన ఆట తీరు త‌న‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంద‌న్నాడు. త‌న‌కు రాబోయే రోజుల్లో మంచి భ‌విష్య‌త్తు ఉంద‌న్నాడు స‌న్నీ. ఇదే స‌మ‌యంలో యశస్వి జైస్వాల్ షుబ్‌మాన్ గిల్‌తో కూడిన రనౌట్ అవుట్ డిస్మిషన్ గురించి చర్చించాడు కూడా. ఇక జైస్వాల్ 82 బంతుల్లో 50 పరుగులు చేశాడు. తదుపరి 63 బంతుల్లో మ‌రో 50 పరుగులు జోడించి తన ఏడవ టెస్ట్ సెంచరీని పూర్తి చేశాడు. తన పేరుకు మరో సెంచరీ జోడించినప్పటికీ, జైస్వాల్ మైదానంలోకి ఉరుములు తెప్పించడం కొనసాగించాడు . ఇదే స‌మ‌యంలో ఉన్న‌ట్టుండి త‌ను 175 వ‌ద్ద ఉండ‌గా ర‌న్ కోసం ప్ర‌య‌త్నించి ర‌నౌట్ అయ్యాడు.

Also Read : AP Home Minister Anitha Important Update : నారా భువ‌నేశ్వ‌రికి హోం మంత్రి కంగ్రాట్స్

Exit mobile version