IND vs UAE : దుబాయ్ : దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా కప్ 2025 ప్రారంభ మ్యాచ్ లో దుమ్ము రేపింది భారత జట్టు. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలోని టీమిండియా (India) ఇటు బౌలింగ్ లో అటు బ్యాటింగ్ లో సత్తా చాటింది. అందరూ ఊహించినట్టుగానే ఉత్కంఠకు తెర దించాడు జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్. కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ ను చివరి నిమిషంలో తీసుకున్నాడు. తనను ఓపెనర్ గా కాకుండా కేవలం వికెట్ కీపర్ గా మాత్రమే వాడుకున్నాడు. ఇది పక్కన పెడితే మ్యాచ్ లో భాగంగా స్కిప్పర్ సూర్య కుమార్ యాదవ్ అంచనాలకు మించి అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నారు భారత బౌలర్లు. తనను కొంత కాలంగా పక్కన పెడుతూ వచ్చిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ సత్తా చాటాడు.
IND vs UAE Asia Cup Match Updates
కేవలం ఎనిమిది పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు కూల్చాడు. ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన యుఎఈ 64 పరుగులకే చాప చుట్టేసింది. ఇక స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా 3 ఓవర్లలో 19 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఇక శివమ్ దూబే సూపర్ షో ప్రదర్శించాడు. తన బౌలింగ్ లో సంజూ శాంసన్ కళ్లు చెదిరేలా క్యాచ్ పట్టాడు. ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 9 వికెట్ల తేడాతో యుఏఈ జట్టును ఓడించింది. ప్రస్తుతం ఆసియా కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ గా ఉన్న ఇండియా హాట్ ఫెవరేట్ గా బరిలోకి దిగింది. అభిషేక్ శర్మ 16 బంతుల్లో 30 రన్స్ చేస్తే గిల్ 20 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. దీంతో టీమిండియా 4.3 ఓవర్లలోనే పని పూర్తి కానిచ్చేసింది.
Also Read : Minister Atchannaidu Fired on YS Jagan : జగన్ రెడ్డీ దమ్ముంటే చర్చకు రా : అచ్చెన్నాయుడు
