Minister Atchannaidu Fired on YS Jagan : జ‌గ‌న్ రెడ్డీ ద‌మ్ముంటే చ‌ర్చ‌కు రా : అచ్చెన్నాయుడు

వ్యవసాయ శాఖ, రైతాంగం అభివృద్ధిపై మేం సిద్దం

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Hello Telugu - Minister Atchannaidu Fired on YS Jagan

Minister Atchannaidu : విజ‌య‌వాడ‌ : మంత్రి అచ్చెన్నాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మాజీ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ కు స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. ద‌మ్ముంటే వ్యవసాయ శాఖ, రైతాంగం అభివృద్ధిపై బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని స‌వాల్ విసిరారు. వ్య‌వ‌సాయ రంగంలో తీసుకొచ్చిన మార్పులను రాష్ట్ర ప్రజల ముందు బహిర్గతం చేసేందుకు సిద్ధంగా ఉన్నామ‌ని ప్ర‌క‌టించారు. జగన్ పాలనలో రైతులు నరకం చూశారని ఆరోపించారు.
కూటమి ప్రభుత్వంపై త‌ను ఆరోప‌ణ‌లు చేయడం విచిత్రంగా ఉందన్నారు. అన్న‌దాత‌ల గురించి మాట్లాడే హ‌క్కు త‌న‌కు లేద‌న్నారు. రైతు కష్టాన్ని దోచుకొని, రైతు కన్నీటి మీద రాజకీయాలు చేసిన వ్యక్తి నువ్వు కాదా అని ప్ర‌శ్నించారు.

Minister Atchannaidu Slams YS Jagan

కూట‌మి ప్రభుత్వం ప్రతి అడుగులో రైతుల‌ పక్షాన నిలుస్తుందని స్ప‌ష్టం చేశారు అచ్చెన్నాయుడు (Minister Atchannaidu ). రైతు కష్టం వృథా కాకుండా ప్ర‌ణాళిక‌లు రూపొందిస్తున్నామ‌ని తెలిపారు. రైతాంగం అభివృద్ధి, వ్వయసాయ శాఖలో చేసిన సంస్కరణలు, రైతుల కోసం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ఓపెన్ డిబేట్‌కు సిద్ధం కావాల‌ని పిలుపునిచ్చారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులకు మోసపూరిత వాగ్దానాలు తప్ప ఇంకేమీ ఇవ్వలేదని, మద్దతు ధరలు కోత పెట్టి, ఇన్సూరెన్స్ డబ్బులు ఆపేసి, పంటలు అమ్మకానికి రాకుండా చేసిన వైసీపీ వైఫల్యాలను ప్రజలు ఇంకా మరచి పోలేదని అన్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు తోడుగా నిలబడి విత్తనాల నుంచి పంట అమ్మకాల వరకు పూర్తి సహకారం అందిస్తోందని అన్నారు. ఎరువులు, విత్తనాలు సమయానికి అందిస్తూ, పంటలకు రుణ సౌకర్యం కల్పిస్తూ, రైతు కుటుంబాలను రక్షించేలా పథకాలను అమలు చేస్తోందన్నారు.

Also Read : Nepal Shocking Protest : హింసాత్మక నిరసనల తర్వాత కాఠ్మాండులో శాంతి వాతావరణం

Exit mobile version