India : దుబాయ్ : దుబాయ్ వేదికగా జరుగుతున్న కీలకమైన ఆసియా కప్ మెగా టోర్నీలో భారత (India) జట్టు దూకుడుతో ఉంది. మరోసారి దాయాది పాకిస్తాన్ కు చుక్కలు చూపించింది. కీలక మ్యాచ్ లో భాగంగా మందుగా బ్యాటింగ్ చేసింది పాకిస్తాన్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 127 పరుగులు మాత్రమే చేసింది. తొలి మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్న కుల్దీప్ యాదవ్ మరోసారి తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. దెబ్బకు పాకిస్తాన్ ఆటగాళ్లు విల విల లాడి పోయారు. టాప్ ఆర్డర్ ను కుప్ప కూల్చడంలో కీలక పాత్ర పోషించాడు. జస్ప్రీత్ బుమ్రా ఆఖరులో మెరిశాడు. పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సల్మాన్ అఘా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. కానీ వర్కవుట్ కాలేదు.
India-Pakistan Match Updates
కుల్దీప్ యాదవ్ 18 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అక్షర్ పటేల్ 18 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీశాడు. దీంతో తక్కువ స్కోర్ కే పరిమితమైంది. పాకిస్తాన్ పతనాన్ని స్టార్ట్ చేశాడు హార్దిక్ పాండ్యా. తన తొలి ఓవర్ లోనే సైమ్ అయూబ్ ను అవుట్ చేశాడు. తదుపరి ఓవర్ లో బుమ్రా హారీస్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో పాకిస్తాన్ 6 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది. కుల్దీప్, అక్షర పటేల్ కళ్లు చెదిరే బంతులతో షాక్ ఇచ్చారు. పాకిస్తాన్ జట్టులో సాహిబ్ జాదా ఫర్హాన్ 44 బాల్స్ ఎదుర్కొని 40 రన్స్ చేశాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ ధీటుగా ఎదుర్కొలేక చతికిల పడ్డారు.
అనంతరం మైదానంలోకి దిగిన టీమిండియా కేవలం 15.5 ఓవర్లలోనే నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్సీ ఇన్నింగ్స్ ఆడాడు. 37 బంతులలో 47 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అభిషేక్ శర్మ 13 బంతుల్లో 31 రన్స్ చేయగా, తిలక్ వర్మ 31 బాల్స్ ఎదుర్కొని 31 పరుగులు చేశారు.
Also Read : PM Modi Warning : అసాంఘిక శక్తులకు కాంగ్రెస్ సపోర్ట్ : మోదీ
