IND vs BAN – Asia Cup 2025 Interesting : భార‌త జోరుకు బంగ్లాదేశ్ బ్రేకులు వేసేనా

సూప‌ర్ 4 లో కీల‌క లీగ్ మ్యాచ్ కు అన్నీ సిద్దం

Hello Telugu - IND vs BAN - Asia Cup 2025 Interesting

Hello Telugu - IND vs BAN - Asia Cup 2025 Interesting

IND vs BAN : దుబాయ్ : దుబాయ్ వేదిక‌గా ఆసియా క‌ప్ 2025 (Asia Cup 2025) మెగా టోర్నీలో భాగంగా సూప‌ర్ 4 లో బంగ్లాదేశ్ జ‌ట్టు కీల‌క‌మైన మ్యాచ్ టీమిండియాతో ఆడ‌నుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఆడిన‌ప్ర‌తి మ్యాచ్ లో విజ‌యం సాధిస్తూ దూసుకు పోతోంది. దాయాది పాకిస్తాన్ రెండుసార్లు ఓట‌మి పాలైంది. ఈ మ్యాచ్ లో ఎవ‌రు గెలుస్తారో వారే ఫైన‌ల్ మ్యాచ్ కు చేరుకుంటారు. ఈ మ్యాచ్ కీల‌కం కానుంది ఇవాళ‌. బుధ‌వారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. టాస్ భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు జరుగుతుంది. మొదటి బంతి భారత కాలమానం ప్రకారం రాత్రి 8.00 గంటలకు బౌల‌ర్ వేస్తాడు.

IND vs BAN – Asia Cup 2025 Updates

రెండు జట్లు జోరుగా పోటీలోకి దిగుతాయి. ఇటీవలే పాకిస్తాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. మ‌రింత బ‌లంగా, దూకుడుతో ఉంది. ప్ర‌ధానంగా ఓపెన‌ర్లు విధ్వంసక‌ర‌మైన బ్యాటింగ్ తో దుమ్ము రేపుతున్నారు. ప్ర‌ధానంగా అభిషేక్ శ‌ర్మ ధాటికి ప్ర‌త్య‌ర్థి బౌల‌ర్లు ల‌బోదిబోమంటున్నారు. వ‌రుస విజ‌యాల‌తో టీమిండియా పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో ఉంది. అంతే కాదు మెరుగైన నెట్ ర‌న్ రేట్ ను సాధించింది. ఇక టోర్నమెంట్‌లో సజీవంగా ఉండటానికి బంగ్లాదేశ్ శ్రీలంకను ఉత్కంఠ భరితమైన ముగింపులో ఓడించింది. ఈ మ్యాచ్‌లో విజయం ఇరువైపులా ఫైనల్‌లో చోటును దాదాపుగా నిర్ధారిస్తుంది.

భారతదేశంలోని అభిమానులు సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే ఛాన్స్ ఉంది. డిజిటల్ వీక్షకులు సోనీలైవ్ , ఫ్యాన్‌కోడ్ యాప్ ద్వారా చూసేందుకు వీలుంది. ఇక‌ బంగ్లాదేశ్‌పై టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో భారత్ 17 మ్యాచ్‌లలో 16 విజయాలతో అద్వితీయ రికార్డును కలిగి ఉంది. అయినప్పటికీ బంగ్లాదేశ్ ఇటీవలి మ్యాచ్‌లలో నిలకడను ప్రదర్శిస్తోంది.

Also Read : Perplexity AI New Innovation : పెర్పెక్లిసిటీ ఏఐ ఆధారిత బ్రౌజ‌ర్

Exit mobile version