Perplexity AI New Innovation : పెర్పెక్లిసిటీ ఏఐ ఆధారిత బ్రౌజ‌ర్

టెక్నాల‌జీ రంగంలో కీల‌క మార్పు

Hello Telugu - Perplexity AI New Innovation

Hello Telugu - Perplexity AI New Innovation

Perplexity : హైద‌రాబాద్ : సాంకేతిక రంగంలో పెను విప్ల‌వం సృష్టించింది చాట్ జిపిటి. దీనిని త‌ల‌ద‌న్నేలా భార‌తీయ టెక్ దిగ్గ‌జం కోలుకోలేని షాక్ ఇచ్చారు. త‌ను ఏఐ ఆధారిత పెర్పెక్లిసిటీ ని తీసుకు వ‌చ్చాడు. ఇప్పుడు దీనినే ప్ర‌పంచ వ్యాప్తంగా ఎక్కువ‌గా వాడుతున్నారు. దీంతో ఒక్క రోజులోనే త‌ను వ‌ర‌ల్డ్ వైడ్ హీరోగా మారాడు. ఇప్పుడు టెక్నాల‌జీ ప‌రంగా ఎన్నో బ్రౌజ‌ర్లు ఉన్నాయి. ఎక్కువ‌గా గూగుల్ ను వాడుతున్నారు. దీనికి పోటీగా ఉండేందుకు మ‌నోడు కొత్త యాక్సెస్ చేసుకునేందుకు వీలుగా బ్రౌజ‌ర్ ను తీసుకు రానున్న‌ట్లు ప్ర‌క‌టించాడు. దీంతో త‌న నుంచి గూగుల్ తీవ్ర పోటీని ఎదుర్కొంటోంది.

Perplexity New Permium Plans

ఇవాళ కీల‌క అప్ డేట్ వ‌చ్చింది పెర్పెక్లిసిటీ (Perplexity) నుంచి. ఏఐ బ్రౌజర్ కామెట్ భారతదేశంలోని ప్రో ప్లాన్ వినియోగదారులకు విస్తరించింది. భారతదేశంలోని ప్రో ప్లాన్ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులోకి తెచ్చింది. బ్రౌజర్ వినియోగదారులు సమావేశాలను బుక్ చేసుకోవడానికి, ఇమెయిల్‌లను పంపడానికి , ప్లాట్‌ఫారమ్ ద్వారా నేరుగా ఆన్‌లైన్ కొనుగోళ్లు చేయడానికి వీలు కల్పిస్తుంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మం లింక్డ్ ఇన్ లో కీల‌క పోస్ట్ షేర్ చేశాడు సీఈఓ అరవింద్ శ్రీనివాస్.కామెట్ డెస్క్‌టాప్ వెర్షన్ ఇప్పుడు మాక్ ఓఎస్ , విండోస్ వినియోగ‌దారుల కోసం అందుబాటులోకి తీసుకు వ‌చ్చిన‌ట్లు ప్ర‌క‌టించాడు. ఆండ్రాయిడ్ వినియోగ‌దారులు ప్లే స్టోర్ ద్వారా ముంద‌స్తుగా ఆర్డ‌ర్ తీసుకు వ‌చ్చిన‌ట్లు వెల్ల‌డించారు.

Also Read : Trump Shocking Comments : ట్రంప్ వ్యాఖ్యలపై వివాదం – పారాసిటమల్‌ సురక్షితమేనని నిపుణుల స్పష్టం

Exit mobile version