IND vs AUS 1st ODI Sensational : నిరాశ ప‌రిచిన శుభ్ మ‌న్ గిల్, విరాట్ కోహ్లీ

25 ప‌రుగుల‌కే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా

Hello Telugu - IND vs AUS 1st ODI Sensational

Hello Telugu - IND vs AUS 1st ODI Sensational

IND vs AUS : ఆస్ట్రేలియా : ఆస్ట్రేలియాతో పెర్త్ లో జ‌రుగుతున్న వ‌న్డే మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఊహించ‌ని రీతిలో వెంట వెంట‌నే మూడు వికెట్లు కోల్పోయింది. హైద‌రాబాద్ స్టార్ క్రికెట‌ర్ నితీష్ కుమార్ రెడ్డి ఈ మ్యాచ్ తో అరంగేట్రం చేశాడు. ఇక కెప్టెన్ గా ప్ర‌మోష‌న్ పొందిన యంగ్ క్రికెట‌ర్ శుభ్ మ‌న్ గిల్ (Shubman Gill) కేవ‌లం 10 ప‌రుగులు మాత్ర‌మే చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇదిలా ఉండ‌గా ఆదివారం ప్రారంభ‌మైన మొదటి వన్డే వర్షం కారణంగా రెండవసారి ఆగి పోయింది. ఆసిస్ బౌల‌ర్ల దెబ్బ‌కు వెంట వెంట‌నే వికెట్లు కోల్పోవ‌డంతో షాక్ త‌గిలింది. స్టార్ క్రికెట‌ర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ విఫలం అయ్యారు. మిచెల్ స్టార్క్ దెబ్బ‌కు కోహ్లీ ఎనిమిది బంతుల్లో డకౌట్‌గా అవుట్ కాగా, రోహిత్ శ‌ర్మ‌ను జోష్ హాజిల్‌వుడ్ ఎనిమిది పరుగులకు అవుట్ చేశాడు.

IND vs AUS 1st ODI Match Updates

అనంత‌రం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ పేసర్ నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో 10 పరుగులకే లెగ్ సైడ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చాడు. క‌డ‌ప‌టి స‌మాచారం అందిన మేర‌కు మైదానంలో వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆరు ప‌రుగుల‌తో, అక్ష‌ర్ ప‌టేల్ 7 ర‌న్స్ తో ఉన్నారు. అంతకు ముందు ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ మొదటి వన్డేలో భారత్‌తో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారతదేశం తరపున ఆల్ రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి దాదాపు ఒక సంవత్సరం క్రితం తన తొలి టెస్ట్ ఆడిన స్టేడియంలో వన్డే అరంగేట్రం చేస్తున్నాడు.

ఇక జ‌ట్ల ప‌రంగా చూస్తే ఇండియా నుంచి రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (సి), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్ ఆడుతున్నారు. ఇక ఆస్ట్రేలియా నుంచి ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (సి), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్ ఆడ‌తారు.

Also Read : IAS Lakshmisha Important Update on Rains : భారీ వ‌ర్షాల‌పై క‌మాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు

Exit mobile version