మోదీ ఉన్నంత వరకు భారత్‌కు అండగా ఉంటాం

G7 సదస్సులో డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

hellotelugu-Trump

అమెరికా : యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న భార‌త దేశం గురించి ప్ర‌త్యేకించి ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. జి-7 దేశాల స‌ద‌స్సు జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా భార‌త‌, అమెరికా దేశాల‌కు చెందిన ప్ర‌ధాని మోదీ, ప్రెసిడెంట్ ట్రంప్ లు పాల్గొన్నారు. కీల‌క స‌మావేశం అనంత‌రం ఇరువురు నేత‌లు మీడియాతో ముచ్చ‌టించారు. జ‌ర్న‌లిస్టులు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. ప్ర‌త్యేకించి ఇటీవ‌ల భార‌త్ పై సుంకాల విధింపు ప్రక్రియ ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ ఇదేమంత పెద్ద విష‌యం కాద‌ని పేర్కొన్నారు.

ఇదే స‌మ‌యంలో ట్రంప్ మ‌రోసారి ప్ర‌ధాన‌మంత్రి మోదీని ఆకాశానికి ఎత్తేశారు. ఆయ‌న త‌న‌కు అత్యంత న‌మ్మ‌కమైన‌, అంత‌కు మించిన స్నేహితుడ‌ని కితాబు ఇచ్చారు. భారత్‌తో ఎలాంటి అధికారిక రక్షణ ఒప్పందం లేక పోయినప్పటికీ, ఒకవేళ భారత్‌పై దాడి జరిగితే అమెరికా ఖచ్చితంగా సహాయం చేయడానికి ముందుంటుందని ఆయన స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఉన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ, “ఆయన (మోదీ) నాయకత్వంలో ఉన్నంత వరకు భారత్‌కు మా పూర్తి మద్దతు ఉంటుంది” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.

ఇదిలా ఉండ‌గా అమెరికా చీఫ్ డొనాల్డ్ ట్రంప్ చేసిన కీల‌క వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. త‌న‌కు కొన్నేళ్లుగా మ‌ద్ద‌తు ఇస్తున్నారంటూ మోదీని ఉద్దేశించి పేర్కొన్నారు. త‌మ మ‌ధ్య బంధం అత్యంత బ‌ల‌మ‌న‌మైద‌ని, అందుకే ఇండియాకు యుఎస్ బేష‌ర‌తు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని నిర్ణ‌యం తీసుకుంద‌ని చెప్పారు.

Exit mobile version