Figs Interesting Facts : ఈ అంజీర్ పండ్లు పాలలో నానబెట్టి తింటే ఆ సమస్యలు సూన్యం

ప్రతి రోజు అంజీర్‌ను తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించవచ్చని చెబుతున్నారు...

Hello Telugu - Figs Interesting Facts

Hello Telugu - Figs Interesting Facts

Figs : మన ఆహారంలో భాగంగా తీసుకునే పండ్లలో అంజీర్ (Figs) (అత్తిపండు)కు ప్రత్యేక స్థానం ఉంది. పచ్చిగా లేదా ఎండబెట్టిన రూపంలో లభించే ఈ పండు, పోషకాలతో సమృద్ధిగా ఉంటుంది. న్యూట్రిషన్లు, వైద్య నిపుణుల సూచనల ప్రకారం, ప్రతి రోజు అంజీర్‌ను తీసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలకు పరిష్కారం లభించవచ్చని చెబుతున్నారు.

అంజీర్ పండ్లలో మెగ్నీషియం, రిబోఫ్లేవిన్, థియామిన్, విటమిన్ B6, విటమిన్ K, పొటాషియం, రాగి, ఫైబర్ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఈ పండ్లలో విరివిగా లభిస్తాయి. ఈ కారణంగా దీనిని ‘పోషకాల గని’గా అభివర్ణించవచ్చు.

Figs – ఎండిన అంజీర్ ప్రయోజనాలు

వేసవి కాలంలో అంజీర్‌ను (Figs) రాత్రిపూట నీటిలో నానబెట్టి తినటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. వేడి స్వభావం ఉన్న ఈ పండు, నీటిలో నానబెట్టినప్పుడు శరీరానికి హానికరం కాకుండా ఉపయోగపడుతుంది. పాలలో నానబెట్టి తీసుకుంటే ప్రయోజనాలు మరింత పెరుగుతాయని డైటీషియన్లు అభిప్రాయపడుతున్నారు.

పాలలో నానబెట్టిన అంజీర్ వల్ల కలిగే లాభాలు:

వాడే విధానం:

రెండు నుండి మూడు ఎండిన అంజీర్ ముక్కలను పాలలో రాత్రంతా నానబెట్టి ఉంచాలి. ఉదయం లేచిన తర్వాత పాలను కొద్దిగా వేడి చేసి త్రాగాలి. అలాగే ఆ ముక్కలను తినవచ్చు. ఈ విధంగా చేస్తే రోజంతా శక్తివంతంగా ఉండటమే కాకుండా, ఆరోగ్య పరంగా పలు లాభాలు పొందవచ్చు.

సూచన: ఏదైనా కొత్త ఆహారపు అలవాట్లను ప్రారంభించే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.

Also Read : Rising Lung Cancer Sensational : రోజురోజుకు పెరుగుతూ వస్తున్న ఊపిరితిత్తుల క్యాన్సర్ మరణాలు

Exit mobile version