హైదరాబాద్ : విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ప్రియదర్శి , జానపద పాటలతో ప్రజల హృదయాలలో స్థానం సంపాదించిన నాగదుర్గ కలిసి నటించిన చిత్రం ఇడుపు కాయితం. ఇది విడుదలకు ముందే తీవ్ర వివాదాని కి తెర తీసింది. ఇడుపు కాయితం అంటే ఎవరికి అర్థం కాదంటూ ఆంధ్రాకు చెందిన కొందరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అయినా ఎక్కడా సినీ రంగానికి చెందిన తెలంగాణ కవులు, కళాకారులు, రచయితలు , దర్శకులు, నిర్మాతలు ఒప్పుకోలేదు. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చివరకు ఆంధ్రాకు చెందిన వారు దిగి వచ్చారు. ఇది పక్కన పెడితే ప్రియదర్శి, నాగదుర్గ మనసు పెట్టి ప్రాణం పోశారు తమకు ఇచ్చిన పాత్రలకు న్యాయం చేశారు. ఇదిలా ఉండగా ఇడుపు కాయితంకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పాటలను విడుదల చేశారు. తెలంగాణకు చెందిన ప్రముఖ సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఈ సందర్బంగా సినిమాను డిసెంబర్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. దీనిపై స్పందించాడు తెలంగాణకు చెందిన ప్రముఖ దర్శకుడు .ఆయన ఎక్స్ వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక సమాజ సంస్కృతిని దాని పల్లె ల్లోనో, గ్లాసు ల్లోనో వెతకకండి. దానిని ఆ సమాజ చరిత్రలో, పోరాటాల్లో, కళల్లో, యుద్ధాల్లో వెతకండి. తెలంగాణను తక్కువ చేసి మాట్లాడటం సులభమే, కానీ దానిని అర్థం చేసుకోవాలంటే సంస్కృతిపై అవగాహన, అధ్యయనం అవసరం. మన జీవితాలను, సంస్కృతులను అత్యంత సహజంగా తెరపైకి తీసుకువచ్చిన ఇడుపు కాయితం వంటి చిత్రాలకు మద్దతునిద్దాం అని పిలుపునిచ్చారు. సినిమా విడుదలయ్యాక మీకు నచ్చకపోతే, అప్పుడు తప్పకుండా విమర్శించండి. కానీ, మీ అజ్ఞానంతో ఒక ప్రాంతం ఉనికిని నిర్వచించడానికి ప్రయత్నించ వద్దని కోరాడు.

















