ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ టాప్

రోహిత్ శ‌ర్మ అగ్ర స్థానంలో కొన‌సాగుతున్నాడు

hellotelugu-ICCODIRankings

దుబాయ్ : ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. బుధ‌వారం అధికారికంగా ప్ర‌స్తుతం తాజా రేటింగ్స్ ను ప్ర‌క‌టించింది మూడు ఫార్మాట్ ల‌కు సంబంధించింది. ఇదిలా ఉండ‌గా భార‌త క్రికెట్ జ‌ట్టుకు చెందిన టాప్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌లు స‌త్తా చాటారు. ఈ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు ఇటీవ‌లే ఇండియాలో సౌతాఫ్రికాతో జ‌రిగిన వ‌న్డే సీరీస్ లో దుమ్ము రేపారు. కోహ్లీ ఏకంగా సెంచ‌రీతో విరుచుకు ప‌డ్డాడు. త‌న‌లో ఇంకా చేవ త‌గ్గ‌లేద‌ని నిరూపించాడు. దీంతో ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ ను ప్ర‌క‌టించింది. ఈ ర్యాంకింగ్స్ లో విరాట్ కోహ్లీ 2వ స్థానానికి చేరుకున్నాడు. మ‌రో వైపు హిట్ మ్యాన్ రోహిత్ శ‌ర్మ అగ్ర‌స్థానంలో ఉన్నాడు.

ఇదిలా ఉండ‌గా విరాట్ కోహ్లీ ప్ర‌స్తుతం రోహిత్ శ‌ర్మ కంటే 8 రేటింగ్ పాయింట్లు వెనుక‌బ‌డి ఉన్నాడు. కోహ్లీ మూడు మ్యాచ్ ల సీరీస్ లో త‌ను 302 ర‌న్స్ చేశాడు. అంతే కాదుప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా ఎంపికయ్యాడు. ఈ సిరీస్‌లో 146 పరుగులు చేసిన భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో తన అగ్రస్థానాన్ని నిలుపు కోగలిగాడు. ఈ ఫార్మాట్‌లో రోహిత్ , కోహ్లీ తదుపరిసారి న్యూజిలాండ్‌తో జరిగే స్వదేశీ సిరీస్‌లో ఆడతారు. జనవరి 11 నుండి భారత్ మూడు వన్డేలు ఆడనుంది. భారత జట్టుకు చెందిన కెఎల్ రాహుల్ , కుల్దీప్ యాదవ్ కూడా వన్డే ర్యాంకింగ్స్‌లో గణనీయమైన పురోగతి సాధించారు. రాహుల్ రెండు స్థానాలు ఎగబాకి 12వ స్థానానికి చేరుకోగా, బౌలర్లలో కుల్దీప్ మూడవ స్థానానికి చేరుకున్నాడు.

Exit mobile version