IAS Srilakshmi : హైదరాబాద్ – ఓబళాపురం మైనింగ్ కేసులో సీనియర్ ఐఏఎస్ శ్రీలక్ష్మికి ఉప శమనం కలిగించేలా తీర్పు చెప్పింది భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టు , ఈ కేసులో ప్రతివాదులకు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కేసు నుండి విముక్తి కోరుతూ శ్రీలక్ష్మి (IAS Srilakshmi) దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు తోసిపుచ్చింది. అంతకు ముందు ఆమెకు బెయిల్ మంజూరైంది. దీనిని సవాల్ చేస్తూ సీబీఐ కోర్టు తమ తరపున ఆమె నిందితురాలని, ఇప్పటికే అభియోగాలు ఉన్నాయని , తనకు జారీ చేసిన ముందస్తు బెయిల్ ను రద్దు చేయాలని పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిలిపి వేస్తూ తీర్పు చెప్పింది. దీనిని సవాల్ చేస్తూ శ్రీలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
IAS Srilakshmi Gets Relief
అయితే అంతకు ముందు శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను హైకోర్టు బెంచ్ కొట్టివేసింది, ఆమె నిందితురాలిగా ఉన్న స్థితిని తిరిగి నిర్ధారించింది. సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణకు మార్గం సుగమం చేసింది. పిటిషన్‌ను విచారిస్తున్నప్పుడు, న్యాయమూర్తులు ఎంఎం సుందరేష్, ఎన్ కె సింగ్ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వు ‘వింతగా’ ఉందని పేర్కొన్నారు. ఇలాంటి తీర్పులు దరఖాస్తుదారుల నుండి పిటిషన్ల వరదకు దారి తీస్తాయని బెంచ్ హెచ్చరించింది.
శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్‌ను మొదట 2022 అక్టోబర్‌లో CBI ప్రత్యేక కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆమె తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది, ఇది మొదట ఆమెను కేసు నుండి విడుదల చేయడానికి అనుమతించింది. అయితే, సీబీఐ ఈ ఉత్తర్వును సుప్రీంకోర్టులో సవాలు చేసింది. మే 2025లో, CBI వాదనలను వినకపోవడం , విచారణకు ముందు దశలో సాక్ష్యాలను తిరిగి మూల్యాంకనం చేయడం వంటి విధానపరమైన లోపాలను పేర్కొంటూ సుప్రీంకోర్టు హైకోర్టు నిర్ణయాన్ని పక్కన పెట్టింది. ఈ కేసును మూడు నెలల్లోపు కొత్త విచారణ కోసం హైకోర్టుకు రిమాండ్ చేశారు.
Also Read : CM Chandrababu – New Innovation : పర్యాటక బస్సులు పారా హుషార్
