న్యూఢిల్లీ : స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. న్యూఢిల్లీలో జరిగిన బీసీసీఐ నమాన్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి జట్టుతో పాటు కలిసి హాజరయ్యాడు. ఈ సందర్బంగా తను కొన్ని మ్యాచ్ లలో ఆడని మాట వాస్తవమేనని పేర్కొన్నాడు. ఇదే క్రమంలో అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో తాను 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. మైదానం బయట మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సూచనలు ఉపయగ పడ్డాయని, కానీ మైదానం లోపట స్టార్ క్రికెటర్ , తన ఓపెనింగ్ సహచరుడు సంజు శాంసన్ చేసిన సూచన తన ఆట తీరులో మార్పు వచ్చిందన్నాడు. దీంతో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేయడం జరిగిందని చెప్పాడు. తాజాగా అభిషేక్ శర్మ చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.
టోర్నీలో తన అనుభవాన్ని పంచుకున్నాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో ఒక ఆఫ్-స్పిన్నర్ బౌలింగ్ చేస్తున్నాడు. అది ఆ ఓవర్‌లో చివరి బంతి. ఆ ఓవర్‌లో దూకుడుగా ఆడాల్సిన అవసరం లేదని సంజు నాతో చెప్పాడు. కానీ నేను షాట్ ఆడటానికి ప్రయత్నించాను, అది సరిగ్గా కుదరలేదు దాంతో నేను ఔటయ్యాను. ఆ సంఘటన తర్వాత ఫైనల్‌లో సంజు శాంసన్ నాకు ఏదైనా సూచిస్తే, అది ఏమైనా సరే కచ్చితంగా పాటించాలని నిర్ణయం తీసుకున్నా. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్‌లో, 5వ ఓవర్ ముగిసే సమయానికి… ఈ ఓవర్‌లో భారీ షాట్లు ఆడాల్సిన పనిలేదని సంజు శాంసన్ నాతో చెప్పాడు, ఎందుకంటే పవర్‌ప్లేలో మాకు ఇంకా ఒక ఓవర్ మిగిలే ఉంది. దాంతో నేను 5వ ఓవర్‌ను సాధారణంగా ఆడాను, ఆ తర్వాత 6వ ఓవర్‌లో ఏకంగా 20 పరుగులు సాధించానని చెప్పాడు అభిషేక్ శర్మ.


















