I Bomma Owner Shocking : ఐ బొమ్మ య‌జ‌మాని ఇమ్మ‌డి ర‌వి అరెస్ట్

సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన పోలీసులు

Hello Telugu - I Bomma Owner Shocking

Hello Telugu - I Bomma Owner Shocking

I Bomma : హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌ర పోలీసుల‌కు స‌వాల్ విసిరి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారిన ఐ బొమ్మ (I Bomma) సంస్థ య‌జ‌మాని ఇమ్మ‌డి ర‌విని ఎట్ట‌కేల‌కు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విష‌యాన్ని ఇవాళ వెల్ల‌డించారు. త‌ను ఫ్రాన్స్ లో ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్నాడు. అక్క‌డి నుండి సినిమాల‌ను అప్ లోడ్ చేస్తూ వ‌చ్చాడు. ద‌మ్ముంటే త‌న‌ను ప‌ట్టుకోవాల‌ని స‌వాల్ విసిరాడు. చివ‌ర‌కు త‌న‌ను అరెస్ట్ చేసేందుకు నానా తంటాలు ప‌డాల్సి వ‌చ్చింది . పైర‌సీ మూవీస్ ను చ‌ట్ట విరుద్దంగా అప్ లోడ్ చేయ‌డం ప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ త‌రుణంలో త‌న ఆచూకి కోసం గ‌త కొంత కాలంగా సెర్చ్ చేశారు. చివ‌ర‌కు ఫ్రాన్స్ నుండి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత హైద‌రాబాద్ లోని కూక‌ట్ ప‌ల్లిలో సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. పైరసీ వెబ్‌సైట్‌ను నడుపుతున్నాడని ఇమ్మ‌డి ర‌విపై తీవ్రైమ‌న‌ ఆరోపణలు ఉన్నాయి, ఇది థియేటర్లలో లేదా OTT విడుదలైన కొద్దిసేపటికే సినిమాలను అక్రమంగా అప్‌లోడ్ చేస్తుంది.

I Bomma Owner Arrested

దీని ఫలితంగా తెలుగు చిత్ర నిర్మాతల నుండి ఫిర్యాదులు పెద్ద ఎత్తున వచ్చాయి. పోలీసులు అతని ఖాతాల నుండి సుమారు \(\రూ. 3) కోట్లు స్తంభింప జేశారు. గతంలో కరేబియన్ దీవుల నుండి వెబ్‌సైట్‌ను నిర్వహిస్తూ వ‌చ్చాడు. ఫ్రాన్స్ నుండి తిరిగి న‌గ‌రానికి వ‌స్తున్నాడ‌ని ట్రేస్ చేశారు. చివ‌ర‌కు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న వెంట‌నే త‌న‌ను గుర్తించి అదుపులోకి తీసుకున్నాడు. పోలీసుల విచార‌ణ‌లో వెబ్‌సైట్ భారీ పైరసీకి పాల్పడిందని ఆరోపించారు సినీ నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు. ఇది తెలుగు చిత్ర పరిశ్రమకు గణనీయమైన ఆర్థిక నష్టాలను తెచ్చిపెట్టింది. త‌న బ్యాంకు ఖాతాలో నిల్వ ఉన్న డ‌బ్బుల‌ను బ్లాక్ చేశారు. సర్వర్‌లలోని సినిమా కంటెంట్‌ను పరిశీలిస్తున్నారు.

Also Read : CM Chandrababu Important Update : పెట్టుబ‌డుల ప్ర‌వాహం సీఎం సంతోషం

Exit mobile version