CM Chandrababu : విశాఖపట్నం : ఏపీకి పెద్ద ఎత్తున పెట్టుబడులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. విశాఖ వేదికగా 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. తన స్నేహితుడు, లులు గ్రూప్ చైర్మన్, ఎండీ యూసుఫ్ అలీని కలవడం ఎల్లప్పుడూ తనకు మరింత ఉత్సాహాన్ని కలిగించేలా చేస్తుందని చెప్పారు నారా చంద్రబాబు నాయుబు (CM Chandrababu). విశాఖపట్నం, పరిసర ప్రాంతాలకు ప్రపంచ స్థాయి మాల్ ఉండాలనే దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న కల త్వరలో సాకారం అవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.
CM Chandrababu Comments
ఎందుకంటే విశాఖపట్నంలో జరిగిన భాగస్వామ్య సదస్సులో లులు మాల్ కోసం ఒప్పందంతో తాము ముందుకు సాగడం ఓ శుభ పరిణామమని పేర్కొన్నారు సీఎం. మల్లవల్లిలోని ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ గురించి కూడా తాము ఈ సందర్బంగా చర్చించడం జరిగిందన్నారు. అక్కడి నుండి వచ్చే జనవరి 1 నాటికి మొదటి షిప్‌మెంట్‌లు పంప బడతాయని ఆయన హామీ ఇచ్చారని తెలిపారు. నిబద్దతకు నిదర్శనం లులు కంపెనీ అని ప్రశంసలు కురిపించారు నారా చంద్రబాబు నాయుడు. ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని ఆ దిశగా భారీ ఎత్తున కంపెనీలు ముందుకు వచ్చాయని చెప్పారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
Also Read : AM Green Group Huge Investments : ఏఎం గ్రీన్ గ్రూప్ రూ. 54 వేల కోట్లు ఇన్వెస్ట్
