నేనే సీఎం నేనే సుప్రీం : రేవంత్ రెడ్డి

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన అనుముల‌

hellotelugu-RevanthReddy

ఢిల్లీ : తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్న ఆయ‌న బుధవారం మీడియాతో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్బంగా పార్టీలోని నేత‌లు, మంత్రుల‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తాను అన‌రాని మాట‌ల‌ను అన్న‌ట్లు కొంద‌రు దుష్ప్ర‌చారం చేస్తున్న‌ట్లు త‌న దృష్టికి వ‌చ్చింద‌న్నారు. అందుకే స్ప‌ష్టంగా తాను ఏమిటో, త‌న ప‌రిమితులు ఏమిటో, త‌న‌కు ఉన్న బాధ్య‌త‌లు ఏమిటో త‌న‌కు బాగా తెలుస‌న్నారు. ఇంకొక‌రు చెబితే నేర్చుకునే స్థితిలో తాను లేన‌ని స్ప‌ష్టం చేశారు. త‌న దృష్టి ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా మార్చాల‌ని, ఆ దిశగా తాను ప్ర‌య‌త్నాలు చేస్తున్నాన‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌లు ప్రాజెక్టుల‌ను కేంద్రం ముందు ఉంచామ‌ని, కేంద్రం కూడా సానుకూలంగా స్పందించింద‌ని చెప్పారు.

ఇదే స‌మ‌యంలో త‌న వ్యాఖ్యలపై అనవసర వివాదం చేస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. .పార్టీలో భిన్న మనస్తత్వాలు ఉంటాయని చెప్పాలని అనుకున్నాన‌ని అన్నారు. డీసీసీ అధ్యక్షులు వయసులో చిన్నవారైనా పెద్ద బాధ్యతలో ఉన్నారని చెప్పే ప్రయత్నం చేసేందుకు ప్ర‌య‌త్నం చేశాన‌ని చెప్పారు. ఇక ఇప్పుడు పూర్తి కాలం తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా తానే ఉంటాన‌ని, రాబోయే ఐదేళ్ల‌లో కూడా తామే ప‌వ‌ర్ లోకి తిరిగి వ‌స్తామ‌న్నారు. దీంతో రెండు ట‌ర్మ్ ల పాటు తానే సుప్రీం అని చెప్ప‌క‌నే చెప్పారు ఎ. రేవంత్ రెడ్డి. తాజాగా ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి పార్టీ వ‌ర్గాల‌లో.

Exit mobile version