Midhun Reddy : అమరావతి – ఎంపీ మిధున్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. కూటమి సర్కార్ కావాలని తనపై లేనిపోని కేసులు బనాయిస్తోందని ఆరోపించారు. కావాలని కక్ష సాధింపు ధోరణితో తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై మద్యం కేసులో ఎలాంటి ఆధారాలు లేవని అన్నారు. రాజకీయ ఒత్తిడి కారణంగానే ఈ కేసు నమోదైందని మండిపడ్డారు. తన ప్రమేయానికి సంబంధించిన ఆధారాలు ఏవైనా ఉంటే చూపించాలని సవాలు చేశారు. కూటమి సర్కార్ కు ఒకటే పని ఉందని, అది ఎలాగైనా వైసీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేయడం తప్ప మరోటి కాదన్నారు.
MP Midhun Reddy Comments
తాను సిట్ దర్యాప్తుకు సహకరిస్తున్నానని, వారి ముందు హాజరవుతున్నానని కూడా ఎంపీ ధృవీకరించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ప్రతీకార రాజకీయాలు జరుగుతున్నాయని ఆరోపించారు మిధున్ రెడ్డి (Midhun Reddy). ఈ మద్యం కేసులో ఎటువంటి ఆధారాలు లేవని, కానీ కావాలని ఇరికించే ప్రయత్నం చేశారన్నారు. నేను కేసులకు భయపడే వ్యక్తిని కాదు. నేను భయపడి ఉంటే, నేను రాజకీయాల్లో ఉండను. నేను ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కొని స్పష్టంగా బయటకు వస్తానని చెప్పారు. నాపై ఏవైనా ఆధారాలు ఉంటే, దానిని చూపించాలన్నారు.. నా ఫోన్‌లను అప్పగించడానికి, దర్యాప్తునకు పూర్తిగా సహకరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
కూటమి సర్కార్ ముందున్న లక్ష్యం ఒక్కటే. వాళ్లు ముందు ఓ కథ తయారు చేసుకుంటారు. అనంతరం సిట్ ఏర్పాటు చేస్తారు. ఇలా తిప్పుతూ ఉంటారని ఆరోపించారు ఎంపీ.
Also Read : Freedom Fighter Mangal Pandey : మంగళ్ పాండే జీవితం స్పూర్తి దాయకం

















