నేను అమాయ‌కురాలిని నాకే పాపం తెలియ‌దు

మ‌రో వీడియో విడుద‌ల చేసిన సింగర్ మంగ్లీ

hellotelugu-Mangli

హైద‌రాబాద్ : అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల‌ను సింగ‌ర్ మంగ్లీ స్కాం సంచ‌ల‌నం రేపింది. ఇప్ప‌టికే త‌న‌పై హైద‌రాబాద్ లోని పంజాగుట్ట‌లో కేసు న‌మోదైంది. త‌న సోద‌రుడి పేరుతో దందాకు తెర లేపింద‌ని, ప‌రిశ్ర‌మ పెడ‌తాన‌ని, ప‌బ్ ఏర్పాటు చేస్తాన‌ని, అచ్చంపేట‌లో కార్పొరేట్ స్కూల్ ను ఏర్పాటు చేస్తానంటూ పెద్ద ఎత్తున న‌మ్మించారు మంగ్లీ టీం. ఆపై ఒక‌టా రెండా ఏకంగా రూ. 200 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. రాష్ట్ర హైకోర్టు న్యాయ‌వాది సుబ్బారావు ఈ స్కాం వ్య‌వ‌హారాన్ని, మంగ్లీ ఆడుతున్న నాట‌కాల‌ను బ‌య‌ట పెట్టాడు. బాధితుల‌కు న్యాయం చేయాల‌ని కోరాడు. తీరా పోలీస్ స్టేష‌న్ కు వెళ్లిన త‌న‌పైనే కేసు న‌మోదు చేశారు పోలీసులు.

మ‌రో వైపు హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ నిందితురాలైన మంగ్లీతో న‌వ్వుతూ ఫోటో ఎలా దిగుతాండంటూ తెలంగాణ హైకోర్టు లాయ‌ర్లు ప్ర‌శ్నించారు. పోలీసుల తీరుప‌ట్ల తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పంజాగుట్ట ఎస్ఐ రామ‌కృష్ణ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశారు. ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి మంగ్లీ కొత్త రాగం అందుకుంది. తాను అమాయ‌కురాలిన‌ని, త‌న‌కు ఏ పాపం తెలియ‌ద‌ని వాపోయింది. ఈ మేర‌కు గురువారం తానే సామాజిక మాధ్య‌మాల వేదిక‌గా ఓ వీడియో రిలీజ్ చేసింది. త‌న‌కు మైక్రో పైనాన్స్ అంటే అర్థం కాద‌ని, తాను డ‌బ్బులు ఎలా వ‌సూలు చేస్తానంటూ ప్ర‌శ్నించింది.

Exit mobile version