నా తంబిని ఎంపిక చేయ‌డం ఆనందంగా ఉంది

సంజూ శాంస‌న్ ఎంపిక‌పై ర‌విచంద్ర‌న్ అశ్విన్

hellotelugu-RAshwin

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ ఆల్ రౌండ‌ర్ , ప్ర‌ముఖ యూట్యూబ‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు ( బీసీసీఐ ) సంచ‌ల‌న నిర్ణయం తీసుకుంది. ఏకంగా కీల‌క‌మైన , జ‌ట్టుకు భారంగా మారిన ఆట‌గాళ్ల‌ను నిర్దాక్షిణ్యంగా త‌ప్పించింది. వారిలో శుభ్ మ‌న్ గిల్ , జితేష్ శ‌ర్మ‌, హ‌ర్షిత్ రాణాల‌ను ప‌క్క‌న పెట్టింది. ఇదే స‌మ‌యంలో అద్భుత‌మైన ఆట తీరుతో ఆక‌ట్టుకున్నా, ప‌రుగుల వ‌ర‌ద పారించినా గ‌త కొంత కాలంగా కావాల‌ని ప‌క్క‌న పెట్టిన టాప్ ప్లేయ‌ర్లు సంజూ శాంస‌న్, రింకూ సింగ్, ఇషాన్ కిష‌న్ ల‌ను ఎంపిక చేసింది త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాల్గొనే జ‌ట్టు కోసం. ఈ సంద‌ర్బంగా స్పందించాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్.

త‌ను అమితంగా ఇష్ట‌ప‌డే క్రికెట‌ర్ల‌లో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంస‌న్ ఒక‌డు. ఇద్ద‌రూ క‌లిసి కొన్నేళ్ల పాటు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టులో క‌లిసి ఆడారు. త‌న సార‌థ్యంలో అశ్విన్ కు అనేక అవ‌కాశాలు ఇచ్చాడు. ఇద్ద‌రూ అన్న‌ద‌మ్ముల్లా ఉంటారు. అందుకే త‌నంటే ప్రేమ‌. త‌న త‌మ్ముడు (తంబి)ను బీసీసీఐ తుది జ‌ట్టులోకి తీసుకోవ‌డం ప‌ట్ల ఆనందం వ్య‌క్తం చేశాడు. రాబోయే కీవీస్ సీరీస్ తో పాటు వ‌ర‌ల్డ్ క‌ప్ లో అద్భుతంగా సంజూ శాంస‌న్ రాణించ‌డం ఖాయ‌మ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశాడు. త‌ను ఓపెనింగ్ జోడీకి స‌రిగ్గా స‌రిపోతాడ‌ని, ఇక అభిషేక్ శ‌ర్మ‌, శాంస‌న్ ల జోడీని త‌ట్టుకోవ‌డం ఇత‌ర జ‌ట్లకు స‌వాల్ గా మార‌బోతోంద‌ని పేర్కొన్నాడు ర‌విచంద్ర‌న్ అశ్విన్.

Exit mobile version