అహ్మదాబాద్ : భారత క్రికెట్ జట్టు లో కీలకమైన ఆటగాడిగా గుర్తింపు పొందాడు ప్రముఖ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. శుక్రవారం అహ్మదాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తాజాగా ఐసీసీ ప్రకటించిన టి20 ర్యాంక్సింగ్స్ లో టాప్ 10లో చోటు దక్కించుకున్నాడు. ఇప్పటి దాకా స్వదేశంలో సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్ లలో 2 వికెట్ల చొప్పున నాలుగు వికెట్లు తీశాడు. త్వరలోనే ఐసీసీ ఆధ్వర్యంలో టి20 వరల్డ్ కప్ జరగాల్సి ఉంది. దీనిపై సీరియస్ గా స్పందించాడు వరుణ్ చక్రవర్తి. సత్తా చాటేందుకు తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ మొదలు పెట్టానని చెప్పాడు. అందరి కళ్లు వరల్డ్ కప్ పై ఉంటాయని ఆ విషయం తనకు తెలుసని అన్నాడు వరుణ్ చక్రవర్తి.
అంతే కాదు ప్రపంచ కప్ కోసం సిద్ధమవ్వడానికి నేను నాపైనే ఒత్తిడి తెచ్చుకుంటానని స్పష్టం చేశాడు.
ప్రధానంగా ప్రత్యర్థిపై మంచి అవగాహనతో, అత్యున్నత స్థాయిలో ఆడటం ముఖ్యం అన్నాడు. నైపుణ్యాలను నమ్మడమే కావాల్సింది. ప్రత్యర్థి జట్లు ఏవేవి ఉన్నాయో , ఆయా జట్లలో ప్రధాన బ్యాటర్లు ఎవరు ఉన్నారనే దానిపై ఫుల్ ఫోకస్ పెట్టానని స్పష్టం చేశాడు స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి. కాగా అహ్మదాబాద్‌లో జరిగే ఐదవ , చివరి టి20 మ్యాచ్ లో తాను మరికొన్ని వికెట్లు తీస్తానని ధీమా వ్యక్తం చేశాడు. . ‘ఫాలో ది బ్లూస్’ కార్యక్రమంలో మాట్లాడాడు వరుణ్ చక్రవర్తి. అంతర్జాతీయ స్థాయిలో ఎదురైన తొలి ఎదురుదెబ్బల నుండి నేర్చుకోవడం, సులభంగా కనిపించే మ్యాచ్‌లలో కూడా మానసికంగా తనను తాను సవాలు చేసుకోవడం ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు.
