ఇండిగో సంక్షోభంపై విమానయాన శాఖ దర్యాప్తు

ప్ర‌యాణీకుల ఖాతాల్లోకి టికెట్ డ‌బ్బులు

hellotelugu-IndigoAnnounce

ఢిల్లీ : దేశ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది దేశీయ విమాన‌యాన శాఖ‌. ప్ర‌ధానంగా తన ప‌రిధిలోని డీజీసీఏ అనుస‌రిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చ‌ర్య‌లు ఒకింత ఇబ్బందిక‌రంగా మారాయి. ఇదే క్ర‌మంలో విమాన స‌ర్వీసుల‌ను నిర్వ‌హిస్తున్న సంస్థ‌లు రోజు రోజుకు ప్ర‌యాణీకుల పాలిట శాపం కావ‌డం, ఉన్న‌ట్టుండి అర్ధాంత‌రంగా ఫ్లైట్స్ రాక పోక‌ల‌ను నిషేధించ‌డం, మ‌రో వైపు ర‌ద్దు చేయ‌డం వ‌ల్ల ప్ర‌యాణీకులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. మొన్న‌టికి మొన్న ఎయిర్ ఇండియా ద్వారా స‌మ‌స్య‌లు కొని తెచ్చుకునేలా చేస్తే ప్ర‌స్తుతం ఇండిగో సంస్థ ఏకంగా 1000 విమాన స‌ర్వీసుల‌ను రద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది.

కింది స్థాయి సిబ్బంది కొర‌త‌, పైల‌ట్స్ లేక పోవ‌డం వ‌ల్ల ఇది సంభ‌వించింద‌ని తెలిపింది. దీంతో దేశంలోని ప‌లు ఎయిర్ పోర్టుల నుంచి స‌ద‌రు సంస్థ విమానాల‌లో జ‌ర్నీ చేసేందుకు ముంద‌స్తుగా బుకింగ్ చేసుకున్న వారికి, ఆల్ రెడీ వెళ్లేందుకు సిద్ద‌మైన ప్ర‌యాణీకుల ప‌రిస్థితి ద‌య‌నీయంగా త‌యారైంది. దీంతో కేంద్ర విమానయాన శాఖ రంగంలోకి దిగింది. సీరియ‌స్ గా వార్నింగ్ ఇవ్వ‌డంతో ఎట్ట‌కేల‌కు సంస్థ దిగి వ‌చ్చింది. ఇండిగో ప్రయాణికుల ఖాతాల్లోకి టికెట్ డబ్బులు జ‌మ చేసింది. రూ.610 కోట్ల రీఫండ్‌ చెల్లించింది. 6 రోజుల సంక్షోభం తర్వాత ప్రయాణికులకు చెల్లింపులు స్టార్ట్ చేసింది.

Exit mobile version