Hydraa Saves Huge Land : పార్కును క‌బ్జా నుండి కాపాడిన హైడ్రా

520 గ‌జాల విలువైన స్థ‌లం

Hello Telugu - Hydraa Saves Huge Land

Hello Telugu - Hydraa Saves Huge Land

Hydraa : హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. క‌బ్జాల‌కు గురైన స్థ‌లాల‌ను గుర్తించే ప‌నిలో ప‌డింది. ఆక్ర‌మ‌ణ‌దారుల‌కు కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చింది . క‌మిషన‌ర్ ఏవీ రంగ‌నాథ్ సార‌థ్యంలో హైడ్రా (Hydraa) అధికారులు నిరంత‌రం ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ప్ర‌తి సోమ‌వారం ప్ర‌జా వాణి నిర్వ‌హిస్తున్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేర‌కు స్వ‌యంగా ప‌రిశీలిస్తున్నారు. అన్ని ప‌త్రాలు స‌రిగా ఉన్నాయో లేదోన‌ని తెలుసుకుని ఆ త‌ర్వాత కబ్జాల‌కు గురైన స్థ‌లాల‌ను కాపాడుతున్నారు. ఇదిలా ఉండగా మేడ్చ‌ల్ – మ‌ల్కాజిగిరి జిల్లా అల్వాల్ మండ‌లం మ‌చ్చ బొల్లారంలోని ఓ పార్కును హైడ్రా కాపాడింది. స‌ర్వే నంబ‌రు 164లో శ్రీ సాయి సూర్య ఫేజ్-2 లో పార్కుకోసం దాదాపు 520 గ‌జాల స్థ‌లాన్ని అప్ప‌ట్లో కేటాయించారు.

Hydraa Saves Huge Land

1972లో వేసిన ఈ లే ఔట్‌లో పార్కు కోసం కేటాయించిన ఈ స్థ‌లాన్ని క‌బ్జా చేసేందుకు కొంత‌మంది ప్ర‌య‌త్నిస్తున్నార‌ని..,పార్కు అభివృద్ధిని అడ్డుకుంటున్నార‌ని శ్రీ సాయి సూర్య కాల‌నీ నివాసితులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ఆదేశాల మేర‌కు క్షేత్ర స్థాయిలో సంబంధిత అధికారుల‌తో హైడ్రా విచార‌ణ పూర్తి చేసింది. పార్కు చుట్టూ ఫెన్సింగ్ వేశారు. దీంతో శ్రీ సాయి సూర్య కాల‌నీ నివాసితులు సంబ‌రాలు చేసుకున్నారు. హైడ్రాను తీసుకు వ‌చ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వానికి మ‌ద్ధ‌తుగా నినాదాలు చేశారు. ద‌శాబ్దాలుగా పార్కు అభివృద్ధిని అడ్డుకున్న వారి చెర నుంచి పార్కును విడిపించిన హైడ్రా అధికారుల‌ను అభినందించారు.

Also Read : K Kavitha New Innovation : ఎమ్మెల్సీ క‌విత‌క్క జ‌నం బాట షురూ

Exit mobile version