Hydraa : హైదరాబాద్ : హైదరాబాద్ లో హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ప్రధానంగా హైడ్రా (Hydraa) కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో కబ్జాదారులకు చుక్కలు చూపిస్తున్నారు. వందల కోట్ల విలువ చేసే ఆక్రమణకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకుంటున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీలో ఆక్రమణకు గురైన రెండు పార్కులను హైడ్రా కాపాడింది. పద్మశ్రీ హిల్స్ కాలనీలోని 2600 గజాల పార్కు స్థలాన్ని రక్షించింది. 1983లో 10 ఎకరాల విస్తీర్ణంలో 230 ప్లాట్లతో లే ఔట్ వేయగా ఇందులో 2600ల గజాల స్థలాన్ని పార్కు కోసం గతంలో ప్రభుత్వం కేటాయించింది. ఇందులో భాగంగా బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీ అధికారులు ఈ పార్కు చుట్టూ ప్రహరీ నిర్మించి అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు.
Hydraa Updates
కాగా ఈ విలువైన స్థలం పక్కనే ల్యాండ్ ఉన్న వారు ఈ స్థలం తనదంటూ అడ్డు కోవడంతో ఆ పనులు ఆగి పోయాయి. పద్మశ్రీ నగర్ కాలనీ నివాసితులు హైడ్రాకు ఇదే విషయాన్ని ఫిర్యాదు చేశారు. స్థానికి రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో క్షేత్రస్థాయిలో పరిశీలించి పార్కుకు కేటాయించిన స్థలాన్ని ఇటీవలే స్వయంగా పరిశీలించారు కమిషనర్ ఏవీ రంగనాథ్. తన పరిశీలనలో స్థలం కబ్జాకు గురైందని తేలింది. దీంతో వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు హైడ్రా సిబ్బందిని. పార్కు స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి హైడ్రా బోర్డులను ఏర్పాటు చేసింది. ఈ కాలనీకి ఆనుకుని ఉన్న పీఎన్‌టీ కానలీలోని డి బ్లాక్‌లో మరో 1112 గజాల పార్కు స్థలానికి కబ్జాల చెర నుంచి విముక్తి కల్పించింది. ఇలా మొత్తం 3712 గజాల పార్కు స్థలాలను కాపాడి చుట్టూ హైడ్రా ఫెన్సింగ్ వేసింది. గతంలో కూడా పీ అండ్ టీ కాలనీలోని సి, బి బ్లాకుల్లో ఉన్న 4400ల గజాల పార్కు స్థలాన్ని హైడ్రా కాపాడిన విషయం విధితమే.
Also Read : BC Reservation Sensational : బీసీ రిజర్వేషన్ల ఉద్యమానికి జై కొట్టిన అఖిలపక్షం


















