Hydraa : హైదరాబాద్ : కబ్జాదారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది హైడ్రా (Hydraa). కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో ప్రతీ సోమవారం ప్రజా వాణి నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఎవరూ ఊహించని రీతిలో పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రత్యేకించి ప్రభుత్వ స్థలాలను కబ్జాకు గురి చేసిన వారిపై ఎక్కువగా ఆరోపణలు రావడం విశేషం. గతంలో వారిపై ఫిర్యాదు చేయాలంటే జంకే వారు, మరికొందరు భయాందోళనకు గురయ్యే వారు. కానీ హైడ్రా పూర్తి రక్షణగా ఉండడం, కబ్జారాయుళ్ల నుంచి విముక్తి కలిగిస్తుండడంతో బాధితులంతా ధైర్యంతో బయటకు వస్తున్నారు. ఇందులో భాగంగా తమకు అందిన ఫిర్యాదుల ఆధారంగా హైడ్రా అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలిస్తున్నారు. సరైనదని , సర్కార్ దేనని తేలితే వెంటనే కూల్చి వేతలు ప్రారంభిస్తున్నారు. ఆపై బోర్డులు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
Hydraa Saved
ఇదిలా ఉండగా తాజాగా ముష్కిన్ చెరువును కాపాడారు. హైడ్రాకు స్థానికులు ధన్యవాదాలు తెలిపారు. ఏకంగా ర్యాలీలు చేపట్టారు. ముష్కిన్ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో మట్టి పోసి బండ్ నిర్మాణం చేపట్టడంతో సరస్సు సహజ ప్రవాహం ఆగిపోగా, అందులోని నీరు కాలుష్యానికి గురైంది. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ముష్కిన్ చెరువు మత్స్యకారుల జీవనాధారంగా ఉండేది. వారు తరతరాలుగా ఇక్కడ చేపల వేట చేసేవారు. ఆ కాలంలో వారి కుటుంబాలు కూడా ఈ సరస్సు నీటినే తాగేవారు. కానీ ఇటీవల కాలంలో సరస్సు కాలుష్యానికి గురై జీవ వైవిధ్యం కోల్పోయింది. స్థానికుల ఫిర్యాదుతో హైడ్రా అధికారులు వెంటనే స్పందించి, ఎఫ్టీఎల్ పరిధిలో పోసిన మట్టిని పూర్తిగా తొలగించారు. చెరువు సహజ పరిమాణం పునరుద్ధరించడంతో సరస్సు తిరిగి తన పాత అందాన్ని సంతరించుకుంది. మత్స్యకారులు, స్థానికులు హైడ్రాకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : K Kavitha Strong Demand : మృతుల కుటుంబాలకు రూ . కోటి పరిహారం ఇవ్వాలి
