Hydraa Sensational : పాత‌బ‌స్తీలో చారిత్ర‌క చెరువు పున‌రుద్ధ‌ర‌ణ‌

న‌వంబ‌రు నాటికి పూర్తి చేయాలన్న హైడ్రా క‌మిష‌న‌ర్‌

Hello Telugu - Hydraa Sensational

Hello Telugu - Hydraa Sensational

Hydraa : హైద‌రాబాద్ : పాత‌బ‌స్తీలో చారిత్ర‌క బ‌మృక్నుద్దౌలా చెరువు స‌ర్వాంగ సుంద‌రంగా సిద్ధ‌మౌతోంది. న‌వంబ‌రు నెలాఖ‌రు నాటికి ఈ చెరువును పూర్తి స్థాయిలో పున‌రుద్ధ‌రించాల‌నే ల‌క్ష్యంతో హైడ్రా (Hydraa) ప‌ని చేస్తోంది. ఈ క్ర‌మంలో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ బ‌మృక్నుద్దౌలా చెరువు పున‌రుద్ధ‌ర‌ణ ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించారు. వంద‌ల ఏళ్ల చ‌రిత్ర ఉన్న ఈ చెరువును జాతి సంప‌ద‌గా భావిత‌రాల‌కు అందించాల్సిన అవ‌స‌రాన్ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఆ క్ర‌మంలోనే చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌ను గ‌త ఏడాది ఆగ‌స్టు నెల‌లో తొల‌గించినట్టు చెప్పారు. 18 ఎక‌రాల‌కు పైగా ఉన్న ఈ చెరువు కేవ‌లం 4.12 ఎక‌రాల‌కు ప‌రిమిత‌మై పోగా.. ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న‌ట్టు పేర్కొన్నారు. ఇప్పుడు చెరువును 18 ఎక‌రాల మేర విస్త‌రించామ‌న్నారు.

Hydraa Updates

వ‌ర‌ద క‌ట్ట‌డితో పాటు భూగ‌ర్భ జ‌లాలు స‌మృద్ధిగా ఉండేలా తీర్చిదిద్దుతున్నామ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ చెప్పారు. చెరువులోకి వ‌ర‌ద నీరు చేరేలా, నిండితే పోయేలా నిర్మించిన ఇన్‌లెట్‌లు, ఔట్‌లెట్లను హైడ్రా క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. ఇదిలా ఉండ‌గా చెరువు చుట్టూ బండ్ నిర్మించి వాకింగ్ ట్రాక్‌లు నిర్మిస్తున్నారు. అలాగే చెరువు క‌ట్ట చుట్టూ, చెరువు లోప‌లి వైపు కూడా ఎవ‌రూ వెళ్ల‌కుండా గ‌ట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలు ఏర్పాటు చేసేలా చూస్తున్నారు. అలాగే వృద్ధులు సేద దీరే విధంగా అక్క‌డ సీటింగ్ ఏర్పాటు చేయ‌డంతో పాటు పార్కులు నిర్మిస్తున్నారు. ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. చెరువు చుట్టూ ర‌హ‌దారులు నిర్మించ‌డంతో పాటు.. గ్రీన‌రీని పెంచే విధంగా మొక్క‌లు నాటుతున్నారు. ప‌చ్చిక బైళ్ల‌ను ఏర్పాటు చేస్తున్నారు.

Also Read : Dude Movie Sensational Collections : ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ డ్యూడ్ వ‌సూళ్ల‌లో రికార్డ్

Exit mobile version