Dude : హైదరాబాద్ : మైత్రీ మూవీ మేకర్స్ ఖాతాలోకి మరో మూవీ చేరింది. ఇప్పటికే పుష్ప-2 తో రికార్డ్ బ్రేక్ చేసిన ఈ సంస్థ మరో వైపు కొత్త దర్శకుడిని తెరపైకి పరిచయం చేసింది. ఇక పరిచయం అక్కర్లేని మరో నటుడు ప్రదీప్ రంగనాథన్. ఎలాంటి అందం లేక పోయినా తనలో అద్బుతమైన టాలెంట్ ఉందని నిరూపించాడు. ప్రస్తుతం తమిళ చలన చిత్ర రంగంలో రజనీకాంత్, ధనుష్ తర్వాత అంతటి పాపులారిటీ దక్కించుకున్నాడు ఈ యాక్టర్. తను తీసి నటించిన లవ్ టుడే , డ్రాగన్ సినిమాలు వరుసగా రూ. 100 కోట్లు కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా కీర్తీశ్వరన్ ను పరిచయం చేస్తూ తీసిన మూవీ డ్యూడ్ (Dude). ఇది కూడా బిగ్ హిట్ గా నిలిచింది. మైత్రీ మూవీ మేకర్స్ కాసుల పంట పండించేలా చేసింది.
Dude Movie Collections
డ్యూడ్ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ తో పాటు మమితా బైజు, శరత్ కుమార్ కీ రోల్స్ పోషించారు. ప్రస్తుతం ఈ మూవీ హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా డ్యూడ్ బ్లాక్ బస్టర్ 100 కోట్ల జర్నీ ఈవెంట్ ని నిర్వహించారు. బాక్సాఫీస్ వద్ద మంచి వేగంతో కొనసాగుతోంది. వరల్డ్ వైడ్ గా 100 కోట్ల క్లబ్‌ను దాటింది. అంతే కాదు 2025లో అత్యధిక వసూళ్లు చేసిన 5వ తమిళ చిత్రంగా నిలిచింది డ్యూడ్. ఇక సాక్నిల్క్ ప్రకారం డ్యూడ్ 11వ రోజు 1.40 కోట్లు వసూలు చేసింది. భారతదేశంలో నికర బాక్సాఫీస్ కలెక్షన్ 66.80 కోట్లకు పెరిగింది. పన్నులు కూడా కలుపుకుంటే, మొత్తం వసూళ్లు 78.82 కోట్లకు చేరుకున్నాయి.
Also Read : CM Revanth Reddy Shocking Comments : సినిమా టికెట్ల రేట్లపై సీఎం షాకింగ్ కామెంట్స్
