Hydraa : హైదరాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. హైదరాబాద్ లోని బంజారాహిల్స్ లో ఆక్రమణలను తొలగించింది. రూ. 750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడింది హైడ్రా (Hydraa).షేక్ పేట్ మండలం బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో ఆక్రమణలను తొలగించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. 5 ఎకరాలలో జలమండలి కి 1.20 ఎకరాలను గతంలో కేటాయించింది సర్కార్. 1.20 ఎకరాలతో పాటు మొత్తం 5 ఎకరాల భూమి తనదంటూ కోర్టును ఆశ్రయించారు పార్థసారథి అనే ఆక్రమణదారుడు. చుట్టూ ఫెన్సింగ్ వేసి బౌన్సర్లతో పాటు వేటకుక్కలతో కాపాలా పెట్టాడు. కోర్టులో వివాదం ఉంటుండగా మొత్తం 5 ఎకరాల భూమిని తన ఆధీనంలోకి తీసుకొని అందులో షెడ్డు లు నిర్మించుకొని పహరా ఏర్పాటు చేశారు.
Hydraa Shocking
ప్రభుత్వ భూమిలోనే అడ్డా వేసుకొని మద్యం సేవించి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్టు ఫిర్యాదులు అందాయి హైడ్రాకు. అనేక నివాస ప్రాంతాలకు తాగునీరు అందించేందుకు వాటర్ రిజర్వాయర్ నిర్మించాలని జలమండలి చేసిన ప్రయత్నాలను అడ్డుకున్నాడు పార్థసారథి . హైడ్రాకు ఫిర్యాదు చేశారు జలమండలి, రెవెన్యూ అధికారులు. ఫేక్ సర్వే నంబర్ (403/52) తో ప్రభుత్వ భూమి కొట్టేసే ప్రయత్నం చేశారు ఆక్రమణదారుడు. ఈ మేరకు పార్థసారధిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో 4 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి 403 సర్వే నంబర్లో ప్రభుత్వ భూమి ఉంటే 403/52 బై నంబర్ వేసి ఆక్రమణలకు పాల్పడినట్టు నిర్ధారణ అయ్యింది. ఆన్ రిజిస్టర్డ్ సేల్ డీడ్ తో 5 ఎకరాల ప్రభుత్వ భూమి తనదంటూ పార్థసారథి క్లెయిమ్ చేస్తున్నట్టు తేలింది. షేక్ పేట్ రెవెన్యూ అధికారుల లేఖ మేరకు భారీ బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించింది.
Also Read : NHRC Shocking Comments : దాడికి పాల్పడిన ఖాకీలపై చర్యలు తీసుకోండి
