Hydraa Proven – AV Ranganath : ముంచెత్తిన వ‌ర్షం స‌హాయ‌క చ‌ర్య‌ల్లో హైడ్రా నిమ‌గ్నం

నీట మునిగిన ప్రాంతాల‌ను ప‌రిశీలించిన క‌మిష‌న‌ర్

hellotelugu-hydraa

Hydraa : హైద‌రాబాద్ – హైద‌రాబాద్ న‌గ‌రాన్ని వ‌ర్షాలు ముంచెత్తాయి. భారీ వ‌ర్షానికి నీట మునిగిన షేక్‌పేట, ఉస్మానియా కాల‌నీలో హైడ్రా (Hydraa) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ ప‌ర్య‌టించారు. పైనుంచి భారీగా వ‌చ్చిన వ‌ర‌ద ఓయూ కాల‌నీలోని త‌నాషాన‌గ‌ర్ , డ్రీమ్ వ్యాలీ ప్రాంతాల‌ను ముంచెత్తాయి. అక్క‌డ నీటిని తొల‌గించే ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షంచించారు. పై నుంచి వ‌చ్చిన వ‌ర‌ద‌ను త‌ర‌లించేందుకు చ‌ర్య‌లు తీసుకుంటూనే.. హెవీ మోటార్ల‌ను పెట్టి నీటిని తోడారు. అనంత‌రం మ‌ల్కం చెరువు ప‌రిస‌ర ప్రాంతాల‌ను ప‌రిశీలించారు. ఒక్క‌సారిగా 12 సెంటీమీట‌ర్ల‌కు పైగా గ‌చ్చిబౌలి, మ‌ణికొండ, ఓయూ కాల‌నీలో వ‌ర్షం కుర‌వ‌డంతో వ‌ర‌ద ముంచెత్తింది. ఓయూ కాల‌నీలో మొత్తం హైడ్రా డీఆర్ ఎఫ్‌, మెట్ టీమ్‌ల‌ను రంగంలోకి దించి.. ఎవ‌రికీ ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా.. చూడ‌డంతో పాటు వ‌ర‌ద నీటిని తొల‌గించే ప‌నుల‌ను ముమ్మ‌రం చేశారు.

Hydraa Commissioner AV Ranganath Key Update

అనంత‌రం గ‌చ్చిబౌలి, కొండాపూర్, మాధాపూర్‌, కృష్ణాన‌గ‌ర్ ప్రాంతాల్లో హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌గారు ప‌ర్య‌టించి ప‌రిస్థితిని క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. హైడ్రా క‌మిష‌న‌ర్ తో పాటు.. హైడ్రా ఆర్ ఎఫ్ వో జ‌య‌ప్ర‌కాష్‌, డీఎఫ్‌వో య‌జ్ఞ‌న నారాయ‌ణ‌, త‌దిత‌రులు అక్క‌డే ఉండి వ‌ర‌ద నీటిని తొల‌గించే ప‌నుల‌ను ప‌ర్య‌వేక్షించారు. గంట స‌మ‌యం వ‌ర్షం ప‌డితే.. వ‌ర‌ద నీటి ముప్పు త‌ప్పించ‌డానికి రెండు గంట‌ల‌కు పైగా శ్ర‌మించాల్సి వ‌చ్చింది. భారీగా వ‌చ్చిన వ‌ర‌ద కింద‌కు వెళ్లేందుకు మార్గం లేక పోవ‌డంతో ఈ స‌మ‌స్య త‌లెత్తింద‌ని అధికారులు గుర్తించారు.

జూబ్లీహిల్స్‌, కృష్ణాన‌గ‌ర్‌, యూసుఫ్‌గూడ నుంచి పెద్ద‌మోత్తంలో వ‌చ్చిన వ‌ర‌దకు ఆటంకంగా మారిన అమీర్‌పేట్ మెట్రో స్టేష‌న్ కింద ఉన్న పైపులలో పూడిక‌ను తొల‌గించ‌డంతో ప‌రిస్థితి మెరుగు ప‌డింది. హైడ్రా బృందాలు వ‌ర్షానికి ముందు నుంచే అక్క‌డ ఉండి వాహ‌న రాక‌పోక‌లకు ఆటంకం లేకుండా జాగ్ర‌త్త ప‌డ్డారు. వ‌ర‌ద కూడా ఎక్కువ స‌మ‌యం నిల‌కుండా.. మోకాలు లోతు నీరుచే రినా వెంట‌నే వెళ్లేలా ఏర్పాట్లు చేశారు. కురిసిన వ‌ర్షానికి న‌గ‌రంలోని ప్ర‌ధాన ర‌హ‌దారుల్లో మొత్తం 18 చెట్లు నేల‌కొరిగాయి. వెనువెంట‌నే హైడ్రా బృందాలు వాటిని తొల‌గించి ట్రాఫిక్‌కు అంత‌రాయం లేకుండా చూశారు.

Also Read : MP Maddila Gurumoorthy Alarming : ర‌హ‌దారుల నిర్మాణానికి నిధులు ఇవ్వండి

Exit mobile version