MP Maddila Gurumoorthy : ఢిల్లీ – తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రహదారుల పరిస్థితి అధ్వాన్నంగా తయారైందని, వెంటనే నిర్మాణాలు చేపట్టేందుకు నిధులు మంజూరు చేయాలని కోరారు ఎంపీ మద్దెల గురుమూర్తి (MP Maddila Gurumoorthy). ఆయన అడిగిన ప్రశ్నలకు కేంద్ర జాతీయ రహదారుల శాఖా మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం ఇచ్చారు. జాతీయ రహదారి -16 పై సూళ్ళురుపేట వద్ద, జాతీయ రహదారి -716 పై కరకంబాడి వద్ద ఫ్లైఓవర్ల నిర్మాణం కోసం గతంలో ఇచ్చిన విజ్ఞప్తలు వచ్చాయన్నారు. వాటిని పరిశీలిస్తామని చెప్పారు.
MP Maddila Gurumoorthy Asking
శ్రీకాళహస్తి-తడ, గూడూరు-రాపూరు-రాజంపేట, ఊతుకోట-తడ రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చమని అభ్యర్థిస్తూ ప్రభుత్వానికి వినతులు అందాయా, అలా అయితే సాధ్యాసాధ్యాల అధ్యయన వివరాలు, బడ్జెట్ కేటాయింపుల వివరాలు తెలుపమని కోరారు ఎంపీ మద్దెల గురుమూర్తి (MP Maddila Gurumoorthy). ఇదే అంశాలపై గతంలో కేంద్ర మంత్రికి పలుమార్లు తాను విన్నవించానని తెలిపారు.
జాతీయ రహదారి-16 పై సూళ్ళూరుపేట షార్ సర్కిల్ వద్ద కి.మీ 81.050 వద్ద రోటరీ జంక్షన్, పాదచారుల కోసం కిమీ 80.970 వద్ద ఇప్పటికే అండర్‌పాస్ లను అభివృద్ధి చేసినట్లు మంత్రి గడ్కరీ వెల్లడించారు. ఇవి తడ-నెల్లూరు వరకు ఉన్న జాతీయ రహదారి నాలుగు లైన్ల ప్రాజెక్టులో భాగంగా పూర్తయ్యాయని స్పష్టం చేశారు. కరకంబాడి వద్ద చిన్నఒరంపాడు నుంచి రేణిగుంట జాతీయ రహదారి 716 నిర్మాణంలో బాగంగా రెండు ముఖ్యమైన అండర్ పాస్‌ల నిర్మాణం జరుగుతుందని అన్నారు. కి.మీ 118.057 వద్ద కరకంబడి రైల్వే క్రాసింగ్ దగ్గర లైట్ వెహికులర్ అండర్‌పాస్, కి.మీ 118.885 వద్ద కట్టపుట్టాలమ్మ ఆలయం సమీపంలో వెహికులర్ అండర్‌పాస్ నిర్మించనున్నారని తెలియజేశారు.
ఈ ప్రాజెక్టును 28 జనవరి 2025న కాంట్రాక్ట్ ద్వారా అప్పగించారని అన్నారు. ఈ పనులు మొదలయ్యాక తరువాత రెండు సంవత్సరాల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. అదేవిధంగా, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా అప్‌గ్రేడ్ చేయాలన్న ప్రతిపాదనలు కేంద్రానికి వచ్చినట్లు మంత్రి చెప్పారు. కాని ఈ రహదారుల నిర్మాణం కోసం ఎలాంటి అధ్యయనం, ఆమోదాలు, బడ్జెట్ కేటాయింపులు లేవని స్పష్టం చేశారు. ఈ రహదారుల పరిశీలన ప్రస్తుతానికి ట్రాఫిక్ రద్దీ, కనెక్టివిటీ అవసరాలు, ప్రాధాన్యత క్రమం ప్రకారం ప్రధానమంత్రి గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్‌కు అనుగుణంగా జరుగుతోందని పేర్కొన్నారు.
Also Read : AP Liquor Scam – Chinta Mohan : ఏపీ లిక్కర్ కుంభకోణం వాస్తవం : చింతా మోహన్
