HYDRAA : హైదరాబాద్ – రంగారెడ్డి జిల్లా మణికొండ మున్సిపాలిటీలోని ముష్కిన్ చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో వేసిన మట్టిని వెంటనే తొలగించాలని హైడ్రా కమిషనర్ (HYDRAA) ఏవీ రంగనాథ్ ఆదేశించారు. ఆగస్టు నెలాఖరుకు చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో వేసిన మట్టితో పాటు పై భాగంలో వేసిన బండ్‌ను తొలగించాలని.. లేని పక్షంలో బాధ్యులపై క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరించారు. అభివృద్ధి పేరిట చెరువు ఎఫ్‌టీఎల్‌లో బండ్ నిర్మించి.. పై భాగాన్ని చెరువు నుంచి బండ్ ద్వారా వేరు చేస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై హైడ్రా కార్యాలయంలో విచారణ చేపట్టారు. సీ ఎస్ ఆర్ నిధుల కింద చెరువును అభివృద్ధి చేస్తున్న తత్వ రియల్ ఎస్టేట్ సంస్థతో పాటు ఆ పనులు చేపట్టిన ద్రవాన్ష్ అనే ఎన్‌జీవో సంస్థ ప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యమారు.
HYDRAA Commission Focus
చెరువు విస్తీర్ణం మొత్తం 50 ఎకరాల వరకూ ఉండగా.. చెరువు చుట్టూ ఎగువ భాగంలో కూడా బండ్ నిర్మించడంతో కేవలం 12 ఎకరాలకు పరిమితం చేసినట్టు అవుతోందని నివాసితులు, ముష్కి చెరువు పరిరక్షణ సమితి ప్రతినిధులు హైడ్రా ముందు వాపోయారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత అభివృద్ధి పనుల పేరిట నిబంధనలకు వ్యతిరేకంగా చెరువులో మట్టి పోయడం పట్ల హైడ్రా కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే మట్టిని తొలగించి పూర్తి స్థాయిలో చెరువును కాపాడి అభివృద్ధి పనులు కొనసాగించాలని సూచించారు. లేని పక్షంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హైదరాబాద్ లో ఎవరైనా సరే ఆక్రమణలకు పాల్పడినా ఊరుకునేది లేదన్నారు ఏవీ రంగనాథ్.
Also Read : MP Gurumurthy Focus on Digital Fraud : డిజిటల్ దోపిడీకి చెక్ పెట్టేందుకు బిల్లు
