Hydraa Commissioner Shocking Comments : చెరువుల‌కు అందాలు అద్ద‌డం అభివృద్ధి కాదు

హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క కామెంట్స్

Hello Telugu - Hydraa Commissioner Shocking Comments

Hello Telugu - Hydraa Commissioner Shocking Comments

Hydraa : హైద‌రాబాద్ : హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చెరువుల అభివృద్ధి అంటే అందాలు అద్ద‌డం ఒక్క‌టే కాద‌ని అన్నారు. దాని అవ‌స‌రాలు నెర‌వేరే విధంగా వాటిని తీర్చిదిద్దాల‌ని స్ప‌ష్టం చేశారు. స‌క‌ల జీవ‌కోటికీ ప్రాణాధారంగా వాటిని రూపొందించాల‌ని పేర్కొన్నారు. చెరువుల్లో ఆక్ర‌మ‌ణ‌ల‌ను, పోసిన మ‌ట్టితో పాటు కొన్నేళ్లుగా పేరుకు పోయిన పూడిక‌ను, దుర్గంధాన్నితొల‌గించిన త‌ర్వాత మిగ‌తా ఆక‌ర్ష‌ణ‌ల‌పై దృష్టి పెట్టాల‌ని సూచించారు. సీఎస్ ఆర్ (కార్పొరేట్ సోష‌ల్ రెస్పాన్స్‌బిలిటీ) కింద చెరువుల‌ను అభివృద్ధి చేస్తున్న వారు ఈ విష‌యాల‌పై దృష్టి పెట్టాల‌ని స్ప‌ష్టం చేశారు. శిల్ప క‌ళా వేదిక‌లో తెలంగాణ డెవ‌ల‌ప్‌మెంట్ ఫోరం నిర్వ‌హించిన సౌత్ ఇండియా సీఎస్ఆర్ స‌మ్మిట్‌లో హైడ్రా (Hydraa) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ ప్ర‌సంగించారు.

Hydraa Commissioner Shocking Comments

సీఎస్ ఆర్ నిధులు పూర్తి స్థాయిలో స‌ద్వినియోగం అయ్యేలా ఆయా సంస్థ‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ‌ను హైడ్రా ఎలా చేప‌ట్టింద‌నేది ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంటతో పాటు న‌గ‌రంలో మొద‌టి విడ‌తగా చేప‌ట్టిన 6 చెరువుల పున‌రుద్ధ‌ర‌ణ గురించి వివ‌రంగా తెలియ చేశారు. చెరువుల్లో వ‌ర‌ద నీరు నిలిచేలా లోతు పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అభిప్రాయ ప‌డ్డారు ఏవీ రంగ‌నాథ్. అలాగే ఇన్‌లెట్లు, ఔట్‌లెట్లు స‌రిగా ఉండేలా చూడాల‌ని సంబంధిత అధికారుల‌ను ఆదేశించారు. చెరువుల్లోకి మురుగు నీరు చేర‌కుండా హైడ్రా చ‌ర్య‌ల‌ను కూడా వివ‌రించారు. విధ్వంసం త‌మ అభిమ‌తం కాద‌ని, అభివృద్ది చేయ‌డం త‌మ ముందున్న ల‌క్ష్య‌మ‌ని అన్నారు హైడ్రా క‌మిష‌న‌ర్.

Also Read : Rajamouli Shocking Comments on Vanga : వంగా సందీప్ రెడ్డిపై రాజ‌మౌళి షాకింగ్ కామెంట్స్

Exit mobile version