Rajamouli : హైదరాబాద్ : భారత దేశంలో మోస్ట్ పాపులర్ దర్శకుడిగా పేరు పొందాడు ఎస్ఎస్ రాజమౌళి (Rajamouli). తను ఇప్పుడు ప్రిన్స్ మహేష్ బాబు, బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రాతో కలిపి అడ్వెంచర్ నేపథ్యంతో మూవీ తీస్తున్నాడు. గ్లోబల్ గా మార్కెట్ పెంపొందించేలా ప్లాన్ చేశాడు. రామోజీ ఫిలిం సిటీలో పెద్ద ఎత్తున ఈవెంట్ ప్లాన్ చేశాడు. 50 వేల మందికి పైగా హాజరు కానున్నారు. రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది. దీనిని తొలిసారిగా జియో హాట్ స్టార్ డిజిటల్ వేదికగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్, టీజర్ ను ఆవిష్కరించనున్నట్లు ప్రకటించారు నిర్వాహకులు. ఈ తరుణంలో జక్కన్న కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఎక్స్ వేదికగా దమ్మున్న డైరెక్టర్ వంగా సందీప్ రెడ్డి గురించి స్పందించాడు.
Rajamouli Shocking Comments on Sandeep Reddy Vanga
తనను రామ్ గోపాల్ వర్మ బాప్ అంటూ పేర్కొన్నాడు. ఇప్పటి వరకు ఇండియన్ మూవీ చరిత్రలో ఆర్జీవికి ప్రత్యేకమైన స్పేస్ ఉంది. శివ మూవీ ప్రమోషన్ లో భాగంగా నాగార్జున, సందీప్ రెడ్డిలతో జరిగిన చర్చలో కూడా వర్ స్వయంగా వెల్లడించడం విశేషం. ఇదిలా ఉండగా వంగా సందీప్ రెడ్డి ఇప్పటి వరకు కేవలం మూడు సినిమాలు మాత్రమే చేశాడు. తొలిసారిగా విజయ్ దేవరకొండతో అర్జున్ రెడ్డి మూవీ తీశాడు. ఇది బాక్సులు బద్దలు కొట్టింది. బాలీవుడ్ లో షాహీద్ కపూర్ తో కబీర్ సింగ్ తీశాడు. ఆ తర్వాత రణ్ బీర్ కపూర్, రష్మిక మందన్నాతో కలిసి యానిమల్ తీశాడు. ఈ మూడు మూవీస్ తో తన సత్తా ఏమిటో చూపించాడు. టాప్ లో కొనసాగుతున్నాడు వంగా సందీప్ రెడ్డి. రాజమౌళి ఆర్జీవీ తర్వాత జెండా ఎగుర వేసిన దర్శకుడిగా వంగాను పేర్కొనడం విశేషం.
Also Read : PM Modi Important Meet : ఢిల్లీ పేలుడు బాధితులకు ప్రధాని పరామర్శ
