ప్ర‌ధాని మోదీని రావ‌ణుడితో పోల్చిన రేవంత్ రెడ్డి

నిన్ను ఓడించేందుకు మా వాన‌ర సైన్యం వ‌చ్చింది

hellotelugu-CM

న్యూఢిల్లీ : సీఈసీ జ్ఞానేష్ కుమార్ ను తొలగించాల‌ని కోరుతూ కాంగ్రెస్ పార్టీ తో కూడిన ఇండియా కూట‌మి ఆదివారం ఛ‌లో ఢిల్లీ కార్య‌క్ర‌మానికి పిలుపునిచ్చింది. దేశం న‌లుమూలల నుంచి పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సంద‌ర్భంగా భారీ ర్యాలీ చేప‌ట్టారు. ఇందులో తెలంగాణ‌కు చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధులు భారీ ఎత్తున పాల్గొన్నారు. గ‌త కొంత‌కాలంగా స‌ర్ పై ఒంట‌రి పోరాటం చేస్తున్న త‌మ అగ్ర నాయ‌కుడు, అమేథీ ఎంపీ రాహుల్ గాంధీకి బేష‌ర‌తుగా మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. పార్టీ శ్రేణుల‌ను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ భ‌వ‌న్ ప్రాంగ‌ణంలో ప్ర‌సంగించారు. ఆయ‌న ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీని రావ‌ణాసురుడితో పోల్చారు. జ‌నం ఆయ‌న‌ను న‌మ్మే స్థితిలో లేర‌న్నారు.

కుట్ర‌లు, కుతంత్రాలు ఎక్క‌వ కాలం సాగ‌వ‌ని ఆరోపించారు. దేశ ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఇక నుంచి మోదీ, అమిత్ షా ఆట‌లు న‌డ‌వ‌వ‌ని ఎద్దేవా చేశారు. రావణుడిగా మారిన‌ మోడీని ఓడించేందుకు మా వానర సైన్యం ఇక్క‌డికి దండుగా క‌దిలి వ‌చ్చింద‌ని అన్నారు రేవంత్ రెడ్డి. రాంలీలా మైదాన్ లో ఓటు చోరీ పై యుద్ధం చేస్తాం అని ప్ర‌క‌టించారు. ఇప్పటికే 13.5 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపించారు. ఓటు హ‌క్కు అనేది భార‌త రాజ్యాంగం క‌ల్పించిన ప్రాథ‌మిక హ‌క్కు అని, దానిని తొల‌గించే , ర‌ద్దు చేసే అధికారం ఏ ఒక్క‌రికీ లేద‌న్నారు. రాబోయే రోజుల్లో 20 కోట్ల ఓట్లు తొలగించేందుకు మోదీ, అమిత్ షా, సీఈసీ జ్ఞానేష్ కుమార్ కుట్ర‌కు తెర లేపారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఈ ఓట్ల తొల‌గింపులో ఎక్కువ‌గా న‌ష్ట పోయింది పేద‌లేన‌ని వాపోయారు.

Exit mobile version