Hydraa Commissioner Shocking Comments : నాలాలు పొంగొద్దు వ‌ర‌ద ముంచెత్తొద్దు – హైడ్రా

వ‌ర‌ద ప్ర‌వాహానికి ఆటంకాలు కలిగించొద్దు

hellotelugu-hydraa

Hydraa : హైద‌రాబాద్ – నాలాలు పొంగ‌కుండా శాశ్వ‌త ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలని హైడ్రా (Hydraa) క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ (AV Ranganath) స్ప‌ష్టం చేశారు. నాలాల‌కు ఉన్న ఆటంకాల‌న్నీ తొల‌గితే చాలా వ‌ర‌కు ముంపు స‌మ‌స్య త‌లెత్త‌ద‌న్నారు. వ‌ర్షాల వేళ‌.. న‌గ‌రంలోని ప‌లు ప్ర‌ధాన నాలాలు, ముంపు ఉన్న ప్రాంతాల‌ను క‌మిష‌న‌ర్ ప‌రిశీలించారు. నాలా ఆక్ర‌మ‌ణ‌ల‌ను ప్ర‌త్య‌క్షంగా చూశారు. వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించారు. భారీ వ‌ర్షాలు ప‌డిన‌ప్పుడు మూసీ న‌దీ ప‌రీవాహ‌కం కంటే ఎక్కువ కూక‌ట్‌ప‌ల్లి, జీడిమెట్ల నాలాలే ప్ర‌మాద‌క‌రంగా మారుతున్నాయ‌ని గ్ర‌హించామ‌న్నారు. ఈ రెండు నాలాలు సాఫీగా సాగ‌క‌పోవ‌డంతో భ‌ర‌త్‌న‌గ‌ర్‌, మూసాపేట‌, బాలాన‌గ‌ర్‌, జింక‌ల‌వాడ‌, దీన్‌ద‌యాల్ న‌గ‌ర్, వినాయ‌క్‌న‌గ‌ర్‌, క‌ల్యాణ్ న‌గ‌ర్ ప్రాంతాలు నీట మునుగుతున్నాయ‌ని.. ఈ ఏడాది ముప్పు లేకుండా చూడాల్సిన బాధ్య‌త అంద‌రిపైనా ఉంద‌న్నారు ఏవీ రంగ‌నాథ్.

Hydraa Commissioner Shocking Comments

జీడిమెట్లలోని ఫాక్స్ సాగ‌ర్ నుంచి వ‌చ్చే వ‌ర‌ద కాలువ ఎక్క‌డిక‌క్క‌డ ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై కుంచించుకు పోయిన విష‌యాన్ని గుర్తించారు. ఫాక్స్ సాగ‌ర్ అలుగు కాలువ ఆన‌వాళ్లే లేకుండా పోవ‌డం ప‌ట్ల ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. జీడిమెట్ల ప్రాంతంలో ఆ కాలువ 30 మీట‌ర్ల వెడ‌ల్పులో ఉంటే క‌ల్వ‌ర్టుల వ‌ద్ద ఉన్న వెడ‌ల్పు కాల‌నీలు, బ‌స్తీలకు వ‌చ్చేస‌రికి లేకుండా పోయింది. బాలాన‌గ‌ర్ జింక‌ల‌వాడ, దీన్‌ద‌యాల్‌న‌గ‌ర్ క‌ల్వ‌ర్టు కింద 22 మీట‌ర్లు వెడ‌ల్పుతో ఉన్న నాలా బ‌స్తీల‌కు వ‌చ్చేస‌రికి 10 మీట‌ర్ల‌కు ప‌రిమిత‌మైంది. వాస్త‌వానికి 22 మీట‌ర్ల వెడ‌ల్పు, నాల‌కు ఇరువైపులా 9 మీట‌ర్ల చొప్పున బ‌ఫర్‌ని క‌లిపి మొత్తం 40 మీట‌ర్ల వెడ‌ల్పుతో ఉండాల్సిన నాలా 10 మీట‌ర్ల‌కు ప‌రిమిత‌మ‌వ్వ‌డం తోనే జీడిమెట్ల నాలా పొడుగునా ఫ‌తేన‌గ‌ర్‌, బాలాన‌గ‌ర్ బ‌స్తీల‌న్నీ నీట మునుగుతున్నాయ‌ని గుర్తించారు.

వెంట‌నే జీడిమెట్ల నుంచి వ‌చ్చే ఈ నాలాను డ్రోన్ కెమేరాతో ప‌రిశీలించారు. ఫాక్స్‌సాగ‌ర్ చెరువు కింద‌న నాలాలో పోసిన మట్టిని వెంట‌నే తొల‌గించాల‌ని ఏవీ రంగ‌నాథ్ ఆదేశించారు. అల్వాల్ మండ‌లం యాప్రాల్ లో నాగిరెడ్డి కుంట క‌బ్జాల‌ను ప‌రిశీలించారు. దాదాపు 19 ఎక‌రాల విస్తీర్ణంలో ఉన్న చెరువు 6 ఎక‌రాల వ‌ర‌కూ క‌బ్జాకు గురైంద‌ని గ్ర‌హించారు. చెరువు గ‌ర్భంలో పోసిన మ‌ట్టిని తొల‌గించాల‌ని ఆదేశించారు.

Also Read : YS Sharmila Shocking Comments : క‌రేడు భూముల జోలికొస్తే ఊరుకోం – ష‌ర్మిల

Exit mobile version