AV Ranganath : హైదరాబాద్ : హైడ్రా పనితీరు పట్ల సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఆక్రమణలు తొలగించి చెరువులను పునరుద్ధరించడం గొప్ప పరిణామం అని కర్ణాటక బృందం హైడ్రాను కొనియాడింది. చెరువుల పునరుద్ధరణ పనులు ఎలా జరుగుతున్నాయని కర్ణాటకలోని బెంగళూరును సందర్శించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో బృందం. అక్కడి నుంచి వచ్చిన వెంటనే హైదరాబాద్ లో జల్లెడ పట్టారు. ఆక్రమణదారులు, కబ్జాదారులకు ఝలక్ ఇచ్చారు. ఈ సందర్భంగా హైడ్రా పనితీరును పరిశీలించింది కర్ణాటక టీం. మెరుగైన పనితీరుతో హైదరాబాద్‌లో ఫలితాలు సాధించిందని అభినందించారు. బతుకమ్మకుంట, కూకట్‌పల్లి నల్లచెరువుతో పాటు నగరంలో మొదటి విడతగా హైడ్రా పునరుద్ధరించిన పలు చెరువులను కర్ణాటకలోని వివిధ విభాగాలకు చెందిన ప్రతినిధుల బృందం సందర్శించింది.
Hydraa AV Ranganath Praises
అనంతరం హైడ్రా కార్యాలయంలో కమిషనర్ ఏవీ రంగనాథ్ ని కలిసి చెరువుల పునరుద్ధరణలో ఎదురైన సవాళ్లను, వాటిని అధిగమించిన తీరును అడిగి తెలుసుకున్నారు. బెంగళూరులోని చెరువుల పరిరక్షణ, పునరుద్ధరణ జరుగుతున్న తీరును పరిశీలించిన హైడ్రా అనతి కాలంలోనే తాము ఇక్కడకు వచ్చి చూసేలా చెరువులను పునరుద్ధరించారు. బతుకమ్మకుంటను చూశాం. ఆక్రమణలకు గురై.. నాడు ముళ్ల పొదలతో ఉన్న చిత్రాలను, వీడియోను చూశాం. నేడు అక్కడ నయనమనోహర దృశ్యం కనిపించింది. ఆక్రమణలు తొలగించి ఏకంగా చెరువును సృష్టించిన తీరు అద్భుతం అనిపించిందని పేర్కొన్నారు కర్ణాటక టీం. ఈ ఏడాది భారీ వర్షాలు కురిసినా.. వరద ముంచెత్తలేదని స్థానికులు చెప్పిన విషయాన్ని కమిషనర్‌కు తెలిపారు. ఇదే పరిస్థితి మిగతా చెరువుల చెంత ఉందని కొనియాడారు. బెంగళూరు నగర మాజీ మేయర్, చెరువులను పునరుద్ధరణలో భాగస్వామ్యం అయిన అధికారులు, కాంట్రాక్టర్లు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ సాంకేతిక బృందంతో సభ్యులు నగరంలో హైడ్రా పునరుద్ధరించిన చెరువుల సందర్శనలో ఉన్నారు.
Also Read : Asim Munir Shocking Comments : మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ను చంపేశారా..?
