హైదరాబాద్ : హైదరాబాద్ లోని విద్యా సంస్థల దగ్గరలోని పాన్ షాప్‌లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. స్కూల్ పిల్లలకు టొబాకో పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారంతో దాడులు నిర్వహించారు.
ఆపరేషన్ సేఫ్ స్కూల్ పేరుతో రంగంలోకి దిగారు. ప్రత్యక్షంగా పాల్గొని పాన్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. స్కూళ్లకు 100 యార్డ్స్ లోపల ఉన్న షాపులే టార్గెట్ చేశార. స్కూల్ పిల్లలు సిగరెట్లు, గుట్కాలు కొంటున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. పిల్లలకు టొబాకో పదార్థాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. భారీ దాడుల్లో భాగంగా, హైదరాబాద్‌లోని పాఠశాలల సమీపంలో 550కి పైగా పాన్ షాపులపై పోలీసులు సోదాలు నిర్వహించారు.
ఇదిలా ఉండగా విద్యా సంస్థలకు 100 గజాల పరిధిలో పాన్ షాపు ఉండటం నిషేధం అని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ తెలిపారు. పాఠశాల విద్యార్థులకు నికోటిన్ ఆధారిత పదార్థాల అమ్మకాలను అరికట్టడానికి, ‘ఆపరేషన్ సేఫ్ స్కూల్’ కార్యక్రమం కింద పోలీసులు షాపులలో సోదాలు నిర్వహించారు. పురానాపుల్, అఘాపుర, హబీబ్‌నగర్, మలక్‌పేట్, చాదర్‌ఘాట్, కాలాపత్తర్, చార్మినార్, పత్తర్‌గట్టి, గోల్కొండ, గోషామహల్, చంద్రాయణగుట్ట, బాలాపూర్, ఉప్పుగూడ, షాహీన్‌నగర్, బోరబండ తదితర ప్రాంతాల్లోని పాఠశాలలకు సుమారు 100 గజాల దూరంలో ఉన్న పాన్ షాపుల్లో, 500 బృందాలుగా విడిపోయి దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది సోదాలు నిర్వహించారు.


















