Pollution Control Board : హైదరాబాద్ : పెట్టుబడులకు స్వర్గ ధామంగా, ఐటీ, లాజిస్టిక్, ఫార్మా రంగాలకు కేరాఫ్ గా మారిన హైదరాబాద్ ప్రస్తుతం కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించింది కాలుష్య నియంత్రణ మండలి (Pollution Control Board). ఈ అందమైన నగరం శబ్ద, వాయు కాలుష్యంలో ఢిల్లీతో పోటీపడినట్లు తెలిపింది. నగరంలో ఇటీవల వాయు, శబ్దకాలుష్య స్థాయి తీవ్రంగా పెరిగిందని, పగటిపూట సైతం శబ్ద కాలుష్యం నమోదైనట్టు స్పష్టం చేసింది. గాలిలో ధూళి కణాల శాతాన్ని పేర్కొనే పీఎం 2.5, పీఎం 10 సాంద్రతలు రెండింటిలోను పెరుగుదల నమోదైనట్టు వెల్లడించింది పీసీబీ.
Pollution Control Board Warning to Hyderabad
పీఎం -2.5 సాధారణ రోజుల్లో 37గా ఉండగా, సోమవారం 69గా నమోదైంది. ఇక పీఎం 10 సాధారణ రోజుల్లో 91గా ఉంటే, దీపావళి పండుగ రోజు 153గా నమోదైంది. పీఎం 2.5.. 86 శాతం, పీఎం 10.. 68 శాతం చొప్పు పెరిగాయి. ఇక గాలిలో సల్ఫర్ డయాక్సైడ్ పరిహానం సాధారణ రోజల్లో 8 ఉంటే, పండుగ రోజున 17గా నమోదయ్యింది. 2024లో ఇది 14గా ఉంటే ఈ సారి 17కు పెరిగింది. నైట్రోజన్ ఆక్సైడ్ సాధారణ రోజుల్లో 26 ఉంటే, 30గా నమోదయ్యింది.
పారిశ్రామికవాడల్లో శబ్దకాలుష్యం పగటి పూట 62.8, రాత్రిపూట 55 డెసిబుల్స్‌గా ఉండగా, పగటిపూట 65.9, రాత్రి 61.6 డెసిబుల్స్‌గా నమోదవగా కమర్షియల్ ప్రాంతంలో శబ్ద కాలుష్యం సాధారణ రోజుల్లో పగటి పూట 61.48, రాత్రి 57.11 డెసిబుల్స్ ఉండగా పగటి పూట 64.05, రాత్రి 61.08 డెసిబుల్స్‌గా నమోదైంది. నివాస ప్రాంతాల్లో (రెసిడెన్షియల్ జోన్)లో శబ్ద కాలుష్యం సాధారణ రోజుల్లో పగటి పూట 62.39, రాత్రిపూట 57 డెసిబుల్స్ ఉంటే, దీపావళి రోజున పగటిపూట 64.03, రాత్రిపూట 60.68 డెసిబుల్స్‌గా నమోదైనట్లు వెల్లడించిన రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి.
Also Read : Jubilee Hills By Elections Sensational : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక బరిలో రైతన్నలు
