Hyderabad Hospital : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించింది సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ స్కాం. ఈ కేసులో ఎండీ డాక్టర్ నమ్రతను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై స్పందించారు హైదరాబాద్ (Hyderabad Hospital) జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె వెంకటి. సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు సంబంధించి ఎలాంటి అనుమతులు తీసుకోలేదన్నారు. తమకు తెలియకుండానే ఇది జరుగుతోందని ఆరోపించారు. అనధికారికంగానే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
Hyderabad Hospital – Srishti Test Tube Baby Center
ఒక టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ను మొదలు పెట్టాలి అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు అప్లై చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అప్లై చేసుకున్నాక ఒక ఫార్మెట్ డౌన్‌లోడ్ అవుతుందని,
దాని తర్వాత స్టేట్ గవర్నమెంట్ ఆరోగ్య శాఖ అధికారులు ఆ సెంటర్ ను పరిశీలిస్తారని చెప్పారు డీఎంహెచ్ఓ. అంతా ఒకే అనుకుంటే మాత్రమే టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు అనుమతులు వస్తాయని అన్నారు. హైదరాబాద్ లో మొత్తం 158 గవర్నమెంట్ సర్టిఫైడ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్స్ ఉన్నాయని వెల్లడించారు. ఇంతకు ముందు సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కు అనుమతులు రద్దు చేశామని స్పష్టం చేశారు.
తాము వెళ్ళినప్పుడు కూడా సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ మూసి ఉందన్నారు. కానీ తమకుతెలియకుండా సీక్రెట్ గా నిర్వహిస్తున్నారని విచారణలో తేలిందన్నారు. నిజానికి ఈ కేసులో సరోగసి జరగలేదన్నారు. వేరే వారి బిడ్డను ఇక్కడ బాధిత దంపతులకు ఇచ్చారని తెలిపారు.
Also Read : CPI Ramakrishna Shocking Comments : బాబు పర్యటనలు తప్పా సాధించింది ఏముంది..?















