HYD Heavy Rains : హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం కారణంగా ఎక్కడికక్కడ కుండ పోత వర్షాలు కురుస్తోంది. పలు జిల్లాలు వాన దెబ్బకు వణుకుతున్నాయి. ప్రధానంగా కామారెడ్డి, ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు (Medak) అతలాకుతలం అయ్యాయి. వాగులు, చెరువులు, కాలువలు పొంగి పొర్లుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున వరద ఉధృతి పెరిగింది. దీంతో 103 ఏళ్ల చరిత్ర కలిగిన పోచారం ప్రాజెక్టు నిండి పోయింది. తట్టుకుని నిలబడింది. ఆనాటి నిజాం రాజు దీనికి శంకుస్థాపన చేశారు. ఇవాళ వేలాది మంది రైతులకు కల్పతరువుగా మారింది.
HYD Heavy Rains Sensational
మరో వైపు పలు జిల్లాలలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు ఆయా జిల్లాల కలెక్టర్లు. కాగా
భారీ వర్షాల కారణంగా కాకతీయ, శాతవాహన విశ్వ విద్యాలయాల పరీక్షలు వాయిదా పడ్డాయి. మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం కొనసాగుతాయని ప్రకటించింది కాకతీయ విశ్వ విద్యాలయం. వర్షాల కారణంగా, ఆగస్టు 28, 29 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను కాకతీయ విశ్వవిద్యాలయం వాయిదా వేసిందని పరీక్షల కంట్రోలర్ ప్రొఫెసర్ రాజేందర్ వెల్లడించారు..
మిగిలిన పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు, వాయిదా పడిన పరీక్షలకు కొత్త తేదీలను త్వరలో ప్రకటిస్తారు. అదేవిధంగా, శాతవాహన విశ్వ విద్యాలయం ఇవాళ జరగాల్సిన బీఈడీ, ఎంఈడీ పరీక్షలను వాయిదా వేసింది. తిరిగి షెడ్యూల్ చేసిన తేదీలను త్వరలో ప్రకటిస్తామని, మిగిలిన పరీక్షలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని స్పష్టం చేసింది.
Also Read : Bigg Boss 19 Interesting : ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ 19 రియాల్టీ షో
