VP CP Radhakrishnan Success : ఉప రాష్ట్ర‌ప‌తిగా రాధాకృష్ణ‌న్ విజ‌యం

ఇండియా కూట‌మి అభ్య‌ర్థిపై గెలుపు

Hello Telugu - VP CP Radhakrishnan Success

Hello Telugu - VP CP Radhakrishnan Success

CP Radhakrishnan : ఢిల్లీ : భార‌త దేశ 17వ ఉప రాష్ట్ర‌ప‌తిగా ఎన్డీఏ త‌ర‌పున బ‌రిలో నిలిచిన మ‌హారాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ క సీపీ రాధాకృష్ణ‌న్ విజ‌యం సాధించారు. ఆయ‌న త‌న స‌మీప ఇండియా కూట‌మి అభ్య‌ర్థి జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డిపై గెలుపొందారు. ఇవాళ ఓటింగ్ జ‌రిగింది. మొత్తం 781 మంది ఎంపీల‌లో 452 ఓట్లు  రాధాకృష్ణ‌న్ (CP Radhakrishnan) కు ల‌భించాయి. వీరిలో 14 మంది ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇవాళ జ‌రిగిన ఓటింగ్ లో మొత్తం 767 ఓట్లు పోల్ అయ్యాయి.

CP Radhakrishnan As a Vice President

ఇండియా కూట‌మి త‌ర‌పున బ‌రిలో నిలిచిన జ‌స్టిస్ బి. సుద‌ర్శ‌న్ రెడ్డికి 300 ఓట్లు ల‌భించాయి. దీంతో ఉప రాష్ట్రపతి ఎన్నికలో సి.పి. రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ రాధాకృష్ణన్ ప్రతిపక్ష పార్టీ ఇండియా బ్లాక్ అభ్యర్థి, మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి B సుదర్శన్ రెడ్డిపై ఆధిక్యత సంపాదించారు. పార్లమెంట్ హౌస్‌లో ఉదయం 10 గంటలకు ఓటింగ్ ప్రారంభమై సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైంది.

ఆత్మ ప్ర‌బోదానుసారం ఓటు వేయాల‌ని కోరారు జ‌స్టిస్ సుద‌ర్శ‌న్ రెడ్డి. చివ‌ర‌కు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా చేసిన మంత్రాంగం ఫ‌లించింది. బిజూ జ‌న‌తాద‌ళ్ , భార‌త రాష్ట్ర స‌మితి పార్టీల‌కు చెందిన ఎంపీలు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. విజ‌యం సాధించిన కేఎస్ రాధాకృష్ణ‌న్ కు అభినంద‌న‌లు తెలిపారు ఎంపీలు, ప్ర‌ధాని, కేంద్ర మంత్రులు.

Also Read : YS Sharmila Fired on CM Chandrababu : తెలుగు జాతికి నేడు చీకటి రోజు : ష‌ర్మిల

Exit mobile version