Jubilee Hills : హైదరాబాద్ : జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలు నువ్వా నేనా అన్న రీతిలో ముందుకు వెళుతున్నాయి. గతంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి గుండె పోటుతో మృతి చెందారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల తేదీని ఖరారు చేసింది. వచ్చే నెల నవంబర్ 11న పోలింగ్ జరగనుంది. ఇప్పటికే నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు చివరి రోజు 189 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 316 కు చేరిన నామినేషన్లు అందాయి. .మిగిలిన వారి పత్రాలను ఈరోజు స్వీకరించేందుకు ఈసీ (EC) అనుమతి ఇచ్చింది. అంతే కాకుండా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ముగ్గురు సీనియర్ అధికారులను నియమించింది.
Jubilee Hills By Elections Update
నామినేషన్ దాఖలు చేసేందుకు షేక్‌పేట్ తహసీల్దార్ కార్యాలయానికి వందలాదిగా తరలి వచ్చారు అభ్యర్థులు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసేందుకు పోటెత్తారు దరఖాస్తుదారులు. ఆర్ఆర్ఆర్ బాధిత రైతులు, నిరుద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, మాల సంఘం నాయకులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో నిన్న అర్ధరాత్రి వరకు పలు నామినేషన్లు స్వీకరించింది ఎన్నికల సంఘం. అర్ధరాత్రి గడుస్తున్నా నామినేషన్ దాఖలు చేసేందుకు అనేక మంది అభ్యర్థులు వేచి చూస్తుండటంతో, ఈరోజు కూడా నామినేషన్ పత్రాలు స్వీకరించడానికి అనుమతించింది ఎన్నికల సంఘం. ఇక కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ , బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకాల దిలీప్ రెడ్డి ఇప్పటికే నామినేషన్లు దాఖలు చేశారు.
Also Read : President Murmu Visited Sabarimala Interesting : శబరిమలను సందర్శించిన ద్రౌపది ముర్ము
