Andaman Gas Discovery Interesting : అండమాన్ సముద్ర గర్భంలో భారీగా గ్యాస్ నిక్షేపాలు

ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) అన్వేషణాత్మక బావి తవ్వకాల్లో ఈ వనరుల జాడ దొరికింది...

Hello Telugu - Andaman Gas Discovery Interesting

Hello Telugu - Andaman Gas Discovery Interesting

Andaman : అండమాన్‌ తీర ప్రాంత సముద్ర గర్భంలో సహజ వాయువు (గ్యాస్‌) నిక్షేపాలు లభ్యమయ్యాయి. అండమాన్‌ దీవుల తూర్పు తీరానికి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్రంలో ప్రభుత్వ రంగ సంస్థ ఆయిల్‌ ఇండియా లిమిటెడ్‌ (ఓఐఎల్‌) అన్వేషణాత్మక బావి తవ్వకాల్లో ఈ వనరుల జాడ దొరికింది.

సమాచారం ప్రకారం, సముద్రంలో తవ్విన ఒక బావిలో 295 మీటర్ల లోతులో సహజ వాయువు లభించినట్టు ఓఐఎల్‌ వెల్లడించింది. అయితే, ఈ బావి నుంచి రోజువారీగా ఎంత గ్యాస్‌ ఉత్పత్తి అవుతుందనే దానిపై కంపెనీ ఇంకా స్పష్టమైన అంచనాకు రాలేదు. 2,650 మీటర్ల తవ్వకాలు పూర్తయిన తర్వాత మాత్రమే ఖచ్చితమైన అంచనాలు ఇవ్వగలమని అధికారులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ ల్యాబొరేటరీలో నిర్వహించిన పరీక్షల ప్రకారం, ఈ గ్యాస్‌లో 87 శాతం వరకు మిథేన్‌ ఉన్నట్టు తేలింది.

Andaman – విస్తారమైన అవకాశాలు

మయన్మార్‌, ఇండోనేషియా తీర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ చమురు, గ్యాస్‌ నిక్షేపాలు కనుగొనబడ్డాయి. అదే తరహాలో అండమాన్‌ (Andaman), నికోబార్‌ దీవులు, వాటి పరిసర సముద్ర ప్రాంతాల్లోనూ విశాలమైన నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇటీవల వెలువడిన ‘ఇండియా హైడ్రోకార్బన్‌ రిసోర్స్‌ అసెస్‌మెంట్‌ స్టడీ’ ప్రకారం, ఈ ప్రాంతంలో దాదాపు 37.1 కోట్ల టన్నుల చమురుకు సమానమైన చమురు, గ్యాస్‌ వనరులు దాగి ఉండే అవకాశముందని అంచనా వేయబడింది.

ఈ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఓఎన్‌జీసీ, ఓఐఎల్‌ కలిసి సుమారు రూ.3,200 కోట్ల పెట్టుబడితో సముద్ర జలాల్లో అన్వేషణ కార్యకలాపాలు చేపట్టాయి. ఇటీవల కేంద్ర పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి కూడా అండమాన్‌ సముద్ర గర్భంలో విశాలమైన చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని స్పష్టం చేశారు.

Also Read : Today Gold Price : నేడు స్థిరంగా ఉన్న పసిడి ధరలు

Exit mobile version