Home Minister Anitha Warning : మ‌హిళ‌ల‌ను కించప‌రిస్తే ఊరుకోం – అనిత

జ‌గ‌న్ రెడ్డికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన మంత్రి

Hello Telugu - Home Minister Anitha Warning

Hello Telugu - Home Minister Anitha Warning

Home Minister Anitha : విజ‌య‌న‌గ‌రం జిల్లా – మ‌హిళ‌లంటే వైసీపీ నేత‌ల‌కు గౌర‌వం లేకుండా పోయింద‌ని అన్నారు మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. ఇలాగే చుల‌క‌న చేసి మాట్లాడుతూ పోతే చూస్తూ ఊరుకునేది లేద‌ని, తాట తీస్తామ‌ని వార్నింగ్ ఇచ్చారు. మంగ‌ళ‌వారం విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గంలో ఆమె ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్బంగా ప్ర‌భుత్వం చేప‌ట్టిన సుపరిపాల‌న‌లో తొలి అడుగు కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి ఏడాది కాలంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు.

Home Minister Anitha Warning to YCP

బొబ్బిలి రావువారి వీధిలో తెలుగుదేశం పార్టీ జెండాను ఆవిష్కరించారు వంగ‌ల‌పూడి అనిత‌ (Home Minister Anitha).భారతదేశం అంటేనే స్త్రీలను గౌరవించే దేశమ‌ని , ప్ర‌పంచ దేశాల‌న్నీ మ‌న మ‌హిళ‌ల‌ను చూసి నేర్చుకుంటున్నార‌ని కానీ జ‌గ‌న్ రెడ్డి వ‌చ్చాక వారికి గౌర‌వం లేకుండా పోయింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆ పార్టీ గురించి, అధినేత గురించి, వారి నేత‌ల నిర్వాకాల గురించి మాట్లాడాలంటే సిగ్గుగా ఉంద‌న్నారు. సాటి మ‌నుషుల‌న్న ఇంకిత జ్ఞానం , సోయి అన్న‌ది లేకుండా ప్ర‌వ‌ర్తిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు.

తల్లి,చెల్లిన గౌరవించని నాయకుడు జ‌గ‌న్ రెడ్డి ఒక నాయ‌కుడేనా అని ప్ర‌శ్నించారు వంగ‌ల‌పూడి అనిత‌. ఒక మ‌హిళా ఎమ్మెల్యేను ప‌ట్టుకుని వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుడు ప్ర‌స‌న్న‌కుమార్ రెడ్డి ఇలా దిగ‌జారుడు మాటలు మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇలా చేయ‌డం వ‌ల్ల‌నే ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో వైసీపీని కేవ‌లం 11 సీట్ల‌కే ప‌రిమితం చేశార‌న్నారు. అయినా వారికి బుద్ది రావ‌డం లేద‌న్నారు.

Also Read : CPI Narayana Shocking Comments : ప‌రామ‌ర్శ‌ల పేరుతో బ‌ల ప్ర‌ద‌ర్శ‌న చేస్తే ఎలా..?

Exit mobile version