Hinduja Group : విశాఖపట్నం : ఏపీకి మరో దిగ్గజ కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు వచ్చింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు తీసుకు వచ్చేందుకు రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. ప్రస్తుతం సీఎం లండన్ పర్యటనలో బిజీగా ఉన్నారని చెప్పారు. ఈ సందర్బంగా దిగ్గజ కంపెనీలతో చర్చలు జరిపారని తెలిపారు. ఇందులో భాగంగా దిగ్గజ సంస్థ హిందూజా గ్రూప్ రూ. 20 వేల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందన్నారు. ఒప్పందం కూడా చేసుకోవడం జరిగిందన్నారు.
Minister Nara Lokesh Hinduja Group Huge Investments in AP
రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా విశాఖలో సీఐఐ పార్టనర్ షిప్ సమ్మిట్- 2025 ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అబద్ధాలు, విరుద్ధ ప్రకటనలతో ఏపీ అభివృద్ధికి మోకాలడ్డుతున్నారని ఆరోపించారు. వైసీపీ నేతల తీరుపై విరుచుకుపడ్డారు. ఇదిలా ఉండగా లండన్‌లోని ప్రముఖ మల్టీ నేషనల్ కంపెనీ రోల్స్ రాయస్ సంస్థ సీటీఓ నిక్కీ గ్రేడి స్మిత్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారని తెలిపారు. ఓర్వకల్లులో మిలటరీ ఎయిర్ స్ట్రిప్, విమానాల ఎంఆర్ఓ యూనిట్ ఏర్పాటుకు అవకాశాలు ఉన్నాయని ఈ సందర్బంగా వివరించినట్లు చెప్పారు నారా లోకేష్. చైర్మన్ శైలేష్ హిరనందానీ, శామ్కో హోల్డింగ్ లిమిటెడ్ చైర్మన్ సంపత్ కుమార్ మల్లాయలతో సీఎం సమావేశం అయ్యారు. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు సీఎం వివరించారు.
Also Read : CM Chandrababu Important Invitation : విశాఖ సీఐఐ సదస్సుకు రండి : సీఎం
