గుంటూరు జిల్లా : గుంటూరు జిల్లాలో అర్ధరాత్రి హైడ్రామా చోటు చేసుకుంది. వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అదుపులోకి తీసుకుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు టీడీపీ నాయకులు, శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ అంబటి రాంబాబుపై హత్యా యత్నం చేసేందుకు పాల్పడ్డాడు. ఇదే క్రమంలో ఆయన ఇంటికి, కారుకు నిప్పంటించారు. ఆఫీస్ లో ఫర్నీచర్, ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. అంబటి రాంబాబు బహిరంగంగా చంద్రబాబు అమ్మ మొగుడు అంటూ సీరియస్ కామెంట్స్ చేయడం కలకలం రేపింది.
ముఖ్యమంత్రిపై అత్యంత దుర్భాషతో, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినందుకు అంబటి రాంబాబుపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో గుంటూరులోని ఆయన నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ముందు తనను అరెస్ట్ చేయాలంటూ పోలీసు శాఖకు సవాల్ విసిరిన రాంబాబు, సాయంత్రానికి తన మాట మార్చి, ఆవేశంలో అలా మాట్లాడానని, చంద్రబాబును ఉద్దేశ పూర్వకంగా దూషించలేదని అన్నారు. చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రి నారా లోకేష్ ను సైతం వ్యక్తిగతంగా దూషించడం చేస్తూ వచ్చారు. ఆయనను అర్ధరాత్రి అరెస్ట్ చేసిన పోలీసులు నల్లపాడు పోలీస్ స్టేషన్ కు తరలించారు. తనపై ఇప్పటి వరకు రెండు ఎఫ్ఐఆర్ కేసులు నమోదు అయ్యాయి.

















