హైదరాబాద్ : రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ నిర్వాకంపై కోర్టు సీరియస్ అయ్యింది. ఒక బాధ్యత కలిగిన మంత్రి ఇలాగేనా వ్యవహరించేది అంటూ న్యాయమూర్తి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే సమయంలో కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాజీ మంత్రి, ప్రస్తుత సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్న కేటీఆర్ ను అనరాని మాటలు అన్నారు మంత్రి కొండా సురేఖ. ప్రముఖ నటి సమంత రుత్ ప్రభు వ్యక్తిగత విషయంపై కామెంట్స్ చేశారు. కేటీఆర్ వల్లనే అక్కినేని నాగార్జున కొడుకు నాగ చైతన్యతో సమంత విడి పోయిందని అన్నారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు మాజీ మంత్రి కేటీఆర్. ఇందుకు సంబంధించి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. ఆపై పరువు నష్టం దావా కేసు వేశారు హైకోర్టులో మంత్రి కొండా సురేఖపై.
ఇందుకు సంబంధించిన కేసుపై విచారణ చేపట్టారు న్యాయమూర్తి. ఇప్పటికే పలుమార్లు కోర్టుకు హాజరు కావాలని మంత్రి కొండా సురేఖను ఆదేశించారు. నోటీసులు కూడా ఇచ్చారు. అయినా డోంట్ కేర్ అన్నట్టుగా వ్యవహరించింది. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు జడ్జి. కొండా సురేఖ స్వయంగా హాజరు కాకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు . కేసు విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో తదుపరి విచారణ చేపడతామని స్పష్టం చేశారు. అంత లోపు కోర్టుకు హాజరు కావాలని లేక పోతే నాన్ బెయిల్ వారెంట్ జారీ చేయాలని ఆదేశించారు కోర్టు న్యాయమూర్తి.
