Hero Ravi Teja : హీరో రవితేజ తండ్రి క‌న్నుమూత

సినీ ప్ర‌ముఖుల తీవ్ర సంతాపం

Hello Telugu - Hero Ravi Teja Father Death

Hello Telugu - Hero Ravi Teja Father Death

Ravi Teja : ప్ర‌ముఖ హీరో ర‌వి తేజ ఇంట్లో విషాదం అలుముకుంది. త‌న తండ్రి రాజ గోపాల్ రాజు హైద‌రాబాద్ లోని త‌న నివాసంలో తుది శ్వాస విడిచారు. ఆయ‌న వ‌య‌సు 90 ఏళ్లు. ఆయ‌న మృతి ప‌ట్ల తీవ్ర సంతాపం వ్య‌క్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఇటీవ‌లే సినిమా షూటింగ్ సంద‌ర్బంగా క‌లిశార‌ని, అంత‌లోనే ఇలా జ‌రుగ‌తుంద‌ని తాను అనుకోలేద‌న్నారు. రాజ గోపాల్ రాజు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు. మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి క‌న్ను మూశార‌ని వెల్ల‌డించారు హీరో ర‌వితేజ‌ (Ravi Teja). త‌ను గ‌త కొంత కాలంగా దీర్ఘ‌కాలిక వ్యాధితో బాధ ప‌డుతున్నారు.

Ravi Teja Father No More

రాజ గోపాల్ రాజుకు హీరో ర‌వితేజ‌తో పాటు ర‌ఘు, భ‌ర‌త్ కుమారులు. హీరోగా ఉన్న భ‌ర‌త్ అనుకోకుండా 2017లో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో దుర్మ‌ర‌ణం చెందాడు. ర‌వితేజ తండ్రి వృత్తి రీత్యా ఫార్మాసిస్ట్ గా ప‌ని చేశారు. ఆయ‌న స్వ‌స్థ‌లం ఏపీలోని కాకినాడ జిల్లా జ‌గ్గంపేట ఊరు. ఎన్నో క‌ష్టాలు ప‌డిన త‌ను కొడుకు ర‌వితేజ కెరీర్ లో స్థిర ప‌డేందుకు ఎంత‌గానో కృషి చేశారు. ర‌వితేజ స్టార్ హీరోగా గుర్తింపు పొందినా, టాప్ హీరోగా కొన‌సాగుతున్న‌ప్ప‌టికీ ఏనాడూ కూడా రాజ గోపాల్ రాజు బ‌య‌ట‌కు రాలేదు. త‌ను ప్ర‌చారం పొందాల‌ని ప‌రితపించ లేదు. మీడియా ముందుకు రాలేదు.

త‌ను ప్రాణ‌ప్ర‌దంగా ప్రేమించిన‌, త‌మ కుటుంబం కోసం అహర్నిశ‌లు క‌ష్ట ప‌డిన త‌న తండ్రిని కోల్పోవ‌డంతో తీవ్ర విషాదంలో ఉన్నారు న‌టుడు ర‌వి తేజ‌. ఆయ‌న తండ్రి మ‌ర‌ణించార‌ని తెలియ‌గానే సినీ రంగానికి చెందిన ప్ర‌ముఖులు తీవ్ర సంతాపం తెలిపారు. రాజ గోపాల్ రాజు ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని కోరారు.

Also Read : Popular Director Pa Ranjith Case : డైరెక్ట‌ర్ పా రంజిత్ పై కేసు న‌మోదు

Exit mobile version