Pa Ranjith : చెన్నై – వెట్టువం సెట్‌లో స్టంట్‌మ్యాన్ మరణం తర్వాత సృజనాత్మక దర్శకుడు పా రంజిత్ మౌనం వీడారు: తను షూటింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సందర్బంగా స్పందించాడు డైరెక్టర్. తనను కోల్పోవడం బాధాకరం. తను అసమాన ప్రతిభా నైపుణ్యం కలిగిన కళాకారుడని పేర్కొన్నాడు. జూలై 13న ఆర్య నటించిన సినిమా సెట్‌లో ప్రమాదకర కారు స్టంట్ చేస్తూ స్టంట్‌మ్యాన్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తన మృతిపై చిత్ర దర్శకుడు పా రంజిత్ (Pa Ranjith), నిర్మాణ సంస్థ నీలం ప్రొడక్షన్స్ సంతాపం వ్యక్తం చేశాయి.
Pa Ranjith Police Case
సామాజిక వేదిక ఎక్స్ లో అధికారికంగా సంయుక్తంగా ప్రకటన విడుదల చేశారు. తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. తను లేని లోటు పూడ్చలేనిది. ఇవాళ మేమందరం షాక్ లో ఉన్నామని పేర్కొన్నాడు దర్శకుడు పా రంజిత్. ఈ మృతి వినాశకరమైనది. తను అద్భుతమైన స్టంట్ ఆర్టిస్ట్. అంతకు మించి అందమైన రూపం, అరుదైన వ్యక్తిత్వం ..మోహన్ రాజు తనకు సోదరుడు అని, తనను కోల్పోవడం తట్టుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉండగా షూటింగ్ సందర్బంగా అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపాడు పా రంజిత్. ప్రతి భద్రతా ప్రోటోకాల్‌ను అనుసరించామని, క్రాష్ స్టంట్‌ను అనుభవజ్ఞుడైన స్టంట్ కొరియోగ్రాఫర్ ధిలీప్ సుబ్బరాయన్ పర్యవేక్షించారని బృందం వెల్లడించాడు. 20 ఏళ్లకు పైగా నటుడు విశాల్ రెడ్డితో అనుబంధం కలిగి ఉన్నాడు స్టంట్ మ్యాన్ రాజు. ఈ ఘటనకు సంబంధించి దర్శకుడు, నిర్మాతలపై కేసు నమోదు చేశారు పోలీసులు.
Also Read : Petrol and Diesel Price Alarming : వాహనదారులకు చక్కటి శుభవార్త..తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు
